ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే బయటకు వెళ్లలేని విధంగా ఎండలు కొడుతున్నాయి. ఈ ఎండల వల్ల వడదెబ్బతో పాటుగా ఇతర వేడి సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.   

ఎండలు కూడా మన ప్రాణాలను తీసేయగలవు. అందుకే మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎండ, వేడి వల్ల మన శరీరంలో ఉష్ణోగ్రత పెరగడంతో పాటుగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. మన శరీరంలో వేడి ఎక్కువగా పెరిగిపోయినప్పుడు వడదెబ్బ తగులుతుంది. భారత్ లో గతంలో ఎన్నడూ లేనంతగా వడగాల్పులు వీస్తుండటంతో చాలా మంది చనిపోతున్నారు. అందుకే వడదెబ్బ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దీని బారిన పడుకూడదంటే ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోవాలి. 

ఎండాకాలంలో మన శరీరానికి అవసరమైన ద్రవాలను తాగకుండా ఎక్కువ వేడి, తేమతో కూడిన వాతావరణంలో వ్యాయామం చేసినప్పుడు వడదెబ్బ తగులుతుంది. కానీ వ్యాయామం చేయని వారికి కూడా వడదెబ్బ తగలొచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎండలో, తగినంత నీరు తాగని వారికి కూడా వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. 

వడదెబ్బ తగిలిన వారు ఎంత తొందరగా హాస్పటల్ కు వెళితే అంత మంచిది. చికిత్స తీసుకోకుండా ఉంటే శరీరంలో ఎన్నో అవయవాల వైఫల్యం సంభవిస్తుంది. ఇది మరణానికి కూడా దారితీస్తాయి. ఒక వ్యక్తి వేడెక్కినప్పుడు వేడి తిమ్మిరి, వేడి అలసట వంటి సమస్యలు వస్తాయి. వడదెబ్బ అంత ప్రాణాంతకం కానప్పటికీ చికిత్స చేయకపోతే ఎన్నో రోగాలు వస్తాయి. 

వడదెబ్బ సంకేతాలు, లక్షణాలు

  • వడదెబ్బ తగిలే వారి శరీర ఉష్ణోగ్రత కనీసం 104 °F (40 °C) ఉంటుంది.
  • గందరగోళం, బ్రాంతి
  • నడవడానికి ఇబ్బంది
  • మూర్ఛ
  • ఫాస్ట్ గా శ్వాస తీసుకోవడం లేదా వేగవంతమైన హృదయ స్పందన
  • చర్మం ఎరుపు, వేడి
  • వాంతులు లేదా విరేచనాలు
  • కండరాల తిమ్మిరి లేదా బలహీనత
  • తలనొప్పి

వడదెబ్బ కొట్టిన వారిని వీలైనంత తొందరగా నీడలోకి తీసుకురావాలి. శరీరాన్ని చల్లబరచాలి. ఇందుకోసం వారి శరీరంపై తడి బట్టలను వేయాలి. చల్లని నీటితో తుడవాలి. వారికి చల్లని గాలి తగిలేలా చూడాలి. రోగిపై చల్లటి నీటిని కూడా పోయొచ్చు. రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లే ముందు ఇవన్నీ చేయండి.

వడదెబ్బను నివారించవచ్చా?

  • మీరు శారీరకంగా చాలా చురుకుగా ఉండటానికి ప్రయత్నించండి. వేడి, తేమతో కూడిన వాతావరణంలో వ్యాయామం చేసేటప్పుడు మధ్యమధ్యలో బ్రేక్ తీసుకోండి. 
  • దాహాన్ని నివారించడానికి నీరు లేదా స్పోర్ట్స్ డ్రింక్స్ వంటి ద్రవాలను పుష్కలంగా తాగండి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో తాగకూడదు. తరచుగా సిప్ చేస్తూ ఉండండి. 
  • ఉదయం చాలా ఎండ ఎక్కువ కాకముందే వీలైనంత ఎక్కువ వ్యాయామం చేయండి. మీ తల, మెడ, చెవులపై సూర్యరశ్మి పడకుండా చూసుకోండి. అవసరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎక్కువసేపు బయట అంటే సూర్యరశ్మిలో ఉండకండి. 
  • వదులుగా, తేలికపాటి దుస్తులనే ధరించండి. మందంగా ఉండే వాటిని వేసుకోకండి. 

వేడి తిమ్మిరి లేదా వేడి అలసట లక్షణాలు మీలో ఉన్నాయేమో చూసుకోండి. వేడి తిమ్మిరి బాధాకరమైన కండరాల తిమ్మిరికి కారణమవుతుంది. తలనొప్పి, వికారం లేదా వాంతులు వేడి అలసటకు కొన్ని లక్షణాలు. ఇది మీకు అలసట లేదా దాహాన్ని కలిగిస్తుంది. మీకు వేడి తిమ్మిరి లేదా వేడి అలసట లక్షణాలు ఉంటే వడదెబ్బ రాకుండా ఉండటానికి మీరు వెంటనే చేయాల్సిన పని మీ శరీరాన్ని చల్లబరచడం.

  • ఫ్యాన్ ముందు కూర్చోవడానికి ముందు చల్లటి నీటితో చేతులను, కాళ్లను, ముఖాన్ని శుభ్రం చేసుకోండి. 
  • చల్లని షవర్ లేదా స్నానం చేయండి.
  • వాటర్ లేదా స్పోర్ట్స్ డ్రింక్ తాగండి. ఆల్కహాల్ లేదా కెఫిన్ పానీయాలను తాగకండి. 
  • మీరు ధరించే అదనపు దుస్తులను తొలగించండి.
  • చల్లని టవల్ లేదా ఐస్ ప్యాక్ ను మీ మెడ, అండర్ ఆర్మ్స్ లో కొద్దిసేపు పెట్టండి.