డయాబెటీస్ పేషెంట్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కంటినిండా నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.  

రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగే పరిస్థితినే డయాబెటిస్ అంటారు. ఈ రోజుల్లో ఈ వ్యాధి సర్వసాధారణ సమస్యగా మారిపోతుంది. ప్రస్తుతం ఎంతో మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ఎంతో మందిని ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతే నరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయి. అందుకే మధుమేహులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలోనే ఉంచుకోవాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. కంటి నిండా నిద్రపోవాలి. ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మందులను వాడాలి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలి. అయితే మధుమేహాన్ని నియంత్రించడంలో ఆహారం పాత్ర ఎనలేనిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు స్టార్చ్ తక్కువగా, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలే తినాలి. కొన్ని రకాల కూరగాయలు డయాబెటీస్ పేషెంట్లకు మంచి ప్రయోజకరంగా ఉంటాయి. అవేంటంటే.. 

బచ్చలికూర

బచ్చలికూర మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ బచ్చలికూర డయాబెటిస్ ఉన్నవారు తినగలిగే ఆకు కూరగాయ. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి, రక్తపోటును తగ్గించడానికి, కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బచ్చలికూర ఎంతో సహాయపడుతుంది. అందుకే దీన్ని రోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న బచ్చలికూర జీర్ణ సమస్యలను దూరం చేయడానికి, కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.

బ్రోకలీ

బ్రోకలీలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ కూరగాయను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు బ్రోకలీని తమ డైట్ లో చేర్చుకోవచ్చు. బ్రోకలీలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. పోషకాలు మాత్రం మెండుగా ఉంటాయి. 

బొప్పాయి జ్యూస్

బొప్పాయి మన ఆరోగ్యానికి, అందానికి కూడా ప్రయోజకరంగా ఉంటుంది. బొప్పాయిలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. బొప్పాయి జ్యూస్ ను తాగితే కూడా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగకుండా ఉంటుంది. 

బీట్ రూట్

బీట్ రూట్ లో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ ను తింటే ఒంట్లో రక్తం పెరగడంతో పాటుగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు. ఈ కూరగాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లు దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 

టమాటాలు

టమోటాల్లో కూడా ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ 30 ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ టమాటాలు బరువు తగ్గేందుకు, ఇమ్యూనిటీ పవర్ పెరిగేందుకు కూడా సహాయపడతాయి.