పెరుగును ఉప్పుతో తింటే మంచిదా? చక్కెరతో తింటే మంచిదా?

ఎండాకాలమైనా, చలికాలమైనా పెరుగును ప్రతి సీజన్ లో తినొచ్చు. సాధారణంగా కొంతమంది పెరుగులో చక్కెరను కలుపుకుని తింటుంటారు. మరికొంతమంది పెరుగులో ఉప్పే బాగుంటుందని దాంతోనే తింటుంటారు. అసలు పెరుగును ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

curd with sugar vs curd with salt which combination is better for your health rsl

పెరుగులో మన ఆరోగ్యానికి మేలు చేసే రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే చాలా మంది పెరుగును ఒక్క ఎండాకాలంలోనే తింటుంటారు. ఇది ఒంట్లో వేడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుందని. కానీ పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తినొచ్చు. చలికాలమైనా, వానాకాలమైనా పెరుగును తింటే మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదంటారు ఆరోగ్య నిపుణులు. అయితే చాలా మంది పెరుగును ఉప్పుతోనే తింటుంటారు. కానీ కొంతమంది మాత్రం చక్కెరతో తింటుంటారు. అసలు పెరుగును ఉప్పుతో తింటే మంచిదా? చక్కెరతో తింటే మంచిదా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

పెరుగును ఉప్పుతో తింటే..

డయాబెటీస్ వ్యాధి ఉన్నవారు పెరుగును పొరపాటున కూడా చక్కెరతో తినకూడదు. ఎందుకంటే చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే మధుమేహులకు పెరుగు , ఉప్పు బెస్ట్ ఆప్షన్. కానీ అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి ఈ కాంబినేషన్ మంచిది కాదు. నిజానికి ఉప్పులో ఎన్నో యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ పెరుగులో ఉప్పును కలిపితే పెరుగులో ఉన్న మంచి బ్యాక్టీరియా నశిస్తుంది. అలాగే ఎక్కువ ఉప్పు కలిపిన పెరుగును తీసుకుంటే రక్తపోటు సమస్యలు కూడా వస్తాయి.  కాబట్టి ఈ రెండింటి కలయిక అస్సలు మంచిది కాదంటారు ఆరోగ్య నిపుణులు. 

పెరుగును పంచదారతో తింటే.. 

పెరుగులో పంచదారను కలుపుకుని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇది మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియాను చంపదు. అలాగే కడుపు చిరాకును కూడా తగ్గిస్తుంది. ఈ కాంబినేషన్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మీరు వేగంగా బరువు తగ్గుతారు. కానీ ఈ కాంబినేషన్ ను డయాబెటీస్ పేషెంట్లు అస్సలు తినకూడదు. కాబట్టి అది ఉప్పు లేదా చక్కెర అయినా.. రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు, నష్టాలు ఉంటాయి. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి పెరుగును తినండి. 

పెరుగును ఎలా తింటే మంచిది? 

పెరుగులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెరను వేసి తినడం వల్ల పెద్దగా ఎలాంటి సమస్యలు రావు. కానీ మీకు డయాబెటీస్ లేదా బీపీ లేదా ఊబకాయం ఉంటే దీనిని తినడం కొన్ని సమస్యలు వస్తాయి. ఇలాంటప్పుడు ఉప్పు, పంచదార కలపకుండా పెరుగు తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios