Asianet News TeluguAsianet News Telugu

ఇక కరోనా మన జీవితంలో శాశ్వతం కానుంది.. నిపుణుల హెచ్చరిక..!

ఇక ఈ కరోనా .. మన జీవితాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని అర్థమట. కేవలం ఆరు నెలల్లో ఇది జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
 

Covid May Become More Manageable In 6 Months: Health Body Chief
Author
Hyderabad, First Published Sep 16, 2021, 11:33 AM IST

కరోనా మహమ్మారి గతేడాది నుంచి మన దేశాన్ని పట్టిపీడిస్తోంది.  ఈ మహమ్మారి కారణంగా.. ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా.. తాజాగా.. ఈ మహమ్మారి గురించి నిపుణులు షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ఈ మహమ్మారి ఇక మన జీవితాల్లో శాశ్వతం కానుందని వారు హెచ్చరిస్తున్నారు.

మరో ఆరు నెలల్లో ఈ మహమ్మారి ఎండమిక్ దశకు చేరుకోనుందని.. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్ర డైరెక్టర్ సుజీత్ సింగ్ తెలిపారు. అంటే.. ఇక ఈ కరోనా .. మన జీవితాల్లో శాశ్వతంగా ఉండిపోతుందని అర్థమట. కేవలం ఆరు నెలల్లో ఇది జరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఆరు నెలల్లో ఇది ఎండెమిక్ దశకు చేరుకుంటుందని అన్నారు. అయితే మరణాల రేటు, సంక్రమణ రేటు నియంత్రణలో ఉన్నట్టయితే మహమ్మారిని కట్టడి చేయవచ్చని చెప్పారు.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కేరళ కూడా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోందని సుజీత్ సింగ్ తెలిపారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషనే కీలకమని చెప్పారు. ఇప్పటి వరకు దేశంలో 75 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారని తెలిపారు. వ్యాక్సిన్ సమర్థత 70 శాతంగా ఉన్నా... దాదాపు 50 కోట్ల మందికి ఇమ్యూనిటీ వచ్చినట్టేనని చెప్పారు.

వ్యాక్సిన్ వల్ల వచ్చిన రోగ నిరోధకశక్తి 70 నుంచి 100 రోజుల తర్వాత క్రమంగా తగ్గుతుందని సుజీత్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో కొత్త వేరియంట్లు వెలుగుచూడటం లేదని... ఒకవేళ కొత్త వేరియంట్ వచ్చినా దాన్ని థర్డ్ వేవ్ గా భావించకూడదని అన్నారు. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ కావడం కొంత ఆందోళనకు కారణమవుతోందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios