మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిపై శ్రద్ధ పెడితే కొలెస్ట్రాల్ ను చాలా వరకు తగ్గించొచ్చు.
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువైతే గుండెపోటు, స్ట్రోక్ వంటి ఎన్నో ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. ఎందుకంటే ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. ఇది గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. ఇది గుండెపోటుతో సహా అనేక సమస్యలకు దారితీస్తుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
అవొకాడో
అవోకాడోల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ అవోకాడోలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కూరగాయను రోజూ తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా తగ్గుతాయి. అలాగే గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇది బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్లలు
డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. ఈ డాక్క్ చాక్లెట్లు తలనొప్పిని, పీరియడ్స్ తిమ్మిరిని తగ్గించడానికి, టెస్టోస్టెరాన్ హార్మోన్ ను పెంచడానికి కూడా సహాయపడతాయి.
ఓట్స్
ప్రతిరోజూ ఓట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ 12-24 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఓట్స్ బరువు తగ్గేందుకు, బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. ఓట్స్ ఆకలి కోరికలను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
చేపలు
సాల్మన్, సార్డినెస్, మాకేరెల్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి.
బచ్చలికూర
శరీరంలో కొవ్వును తగ్గించే ఆహారాలలో బచ్చలికూర ఒకటి. బచ్చలికూరలో విటమిన్ బి, మెగ్నీషియం, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటాయి. అందుకే బచ్చలికూరను మీ ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది.
బెర్రీలు
బెర్రీల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, కోరిందకాయలు వంటి బెర్రీలు అన్నీ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
బీన్స్
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడే వాటిలో బీన్స్ ఒకటి. వీటిని తింటే కూడా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
బొప్పాయి
బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో ఫ్యాటీ యాసిడ్స్, ఒలేయిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
నారింజ
నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. వీటిలో ఉండే పెక్టిన్ ఫైబర్, లిమోనాయిడ్ సమ్మేళనాలు రక్త నాళాలు చిన్నగా కాకుండా నిరోధిస్తాయి. అలాగే ఎల్డిఎల్ స్థాయిలను తగ్గిస్తాయి. సిట్రస్ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. కాబట్టి ఆరెంజ్ జ్యూస్, ద్రాక్ష రసం, నిమ్మరసం వంటివి డైట్ లో చేర్చుకోండి.
