Asianet News TeluguAsianet News Telugu

డయాబెటీస్ పేషెంట్లు మామిడి పండ్లను తినొచ్చా? తింటే ఏం కాదా?

మామిడి పండ్ల సీజన్ రానే వచ్చింది. ఈ సీజన్ పోతే మామిడి పండ్లను మళ్లీ తినలేం. అందుకే ఎండాకాలంలో మామిడి పండ్లను రోజూ తింటుంటారు. అయితే మామిడి పండ్లు తీయగా ఉంటాయి. మరి వీటిని మధుమేహులు తినొచ్చా? లేదా ? అనే దానిపై చాలా మందికి అనుమానాలు ఉంటాయి. 
 

Can people with diabetes eat mangoes? rsl
Author
First Published Mar 21, 2023, 11:37 AM IST

మామిడి భారతదేశంలో ఒక ప్రసిద్ధ పండు. తీయగా, జ్యూసీగా ఉండే ఈ పండు ప్రతి ఒక్కరికీ ఇష్టమే. దీని వాసన చూడగానే నోట్లో లాలాజలం వచ్చేస్తుంది. అందులోనూ మన దేశంలో ఎన్నో రకాల మామిడి పండ్లు ఉన్నాయి. అల్ఫోన్సో, దషేరి వంటివి మన దేశంలో 1,500 కి పైగా మామిడి పండ్ల రకాలు ఉన్నాయి. అయినప్పటికీ.. డయాబెటిస్ పేషెంట్లు దీనిని తినాలా? వద్దా? అని ఆలోచిస్తుంటారు. ఎందుకంటే ఈ పండు తీయగా ఉంటుంది. 

అయితే ఇంటర్నెట్ లో చూస్తే దీనిపై రెండు రకాల సమాధానాలు ఉంటాయి. మధుమేహులు మామిడి పండ్లను తినకూడదని కొందరు చెప్తే.. మరికొందరు మామిడి పండ్లను తినొచ్చని చెప్తారు. 

బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటే మామిడి పండ్లను తినొచ్చు. అయితే సరైన సమయంలో, సరైన పద్ధతిలో, తగిన పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక్క పండులో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే రోజుకు ఈ పండ్లనుంచి మొత్తం 30 గ్రాముల కార్బోహైడ్రేట్లను మాత్రమే తినాలని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు తీపిలో మారొచ్చు. అంటే కొన్ని పండ్లు తక్కువ తీయగా ఉంటాయి. మీకు లభించే పండ్లు ఎలా ఉన్నాయో చూసి మోతాదులో తినండి. 

కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ ను డయాబెటిస్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండును మోతాదులో తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమేమీ ఉండదు. దీనిలో పొటాషియం కూడా ఉంటుంది. ఈ షరతులు పాటిస్తే డయాబెటిస్ రోగులు కూడా ఈ టేస్టీ పండును టేస్ట్ చేయొచ్చు. అయితే మామిడి పండ్లను తినే ముందు రిజిస్టర్డ్ డైటీషియన్ ను సంప్రదించడం మంచిది.

మామిడి పండ్లను తినడానికి ఉత్తమ మార్గం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లేదా గుజ్జును నేరుగా తినొచ్చు. అయితే మన లాలాజలంలోని లాలాజల అమైలేస్ అనే ఎంజైమ్ ఉపయోగించి మన నోరు కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడం ప్రారంభిస్తుంది.

అయితే మామిడి పండును కట్ చేయకుండా.. నేరుగా అలాగే తింటే దాని రుచి అద్బుతంగా ఉంటుంది. అంతేకాదు ఇలా మామిడి స్కిన్ నుంచి నేరుగా తినడం వల్ల మరింత సంతృప్తి చెందుతాం. అయితే మ్యాంగో షేక్స్ లేదా జ్యూస్ లు తాగితే మామిడి పండ్లను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఈ జ్యూస్ లు లేదా షేక్స్ అంత రుచిగా అనిపించవు కూడా. 

డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ సగం మామిడి కంటే ఎక్కువ తినకూడదని నిపుణులు చెబుతున్నారు.  పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉన్నా లేదా రక్తంలో చక్కెర స్థాయిలు అస్తవ్యస్తంగా ఉన్నా మీరు నిపుణుల సలహా మేరకే మామిడి పండ్లను తినాలి. మామిడి పండ్లను వర్కవుట్స్ తర్వాత, మార్నింగ్ వాక్ తర్వాత, భోజనాల మధ్య తినాలి.

Follow Us:
Download App:
  • android
  • ios