Asianet News TeluguAsianet News Telugu

నీళ్లు ఎక్కువ తాగితే తొందరగా బరువు తగ్గుతారా?

నీళ్లతో సర్వ రోగాలు దూరమవుతాయంటారు పెద్దలు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నీళ్లను ఎక్కువగా తాగితే తొందరగా బరువు కూడా తగ్గుతారు. 
 

Can drinking more water help you lose weight faster?
Author
First Published Mar 20, 2023, 3:44 PM IST

మన శరీరానికి నీరు అవసరం కాదు అత్యవసరం. నీరు మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నిపుణుల ప్రకారం.. నీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మన శరీరంలో 60 శాతం నీరుంటుంది. ఇది జీవక్రియ, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఆర్ద్రీకరణతో పాటు పోషకాల రవాణా వంటి ఎన్నో విధులకు సహాయపడుతుంది. .

నీటితో బరువు తగ్గడం

నీటిని ఎక్కువగా తాగితే బరువు సులువుగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. నీరు జీవక్రియను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. నీటిని ఎక్కువగా తాగితే కేలరీలను తీసుకోవడం చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల మీరు నెమ్మదిగా బరువు తగ్గుతారు. కానీ జస్ట్ నీళ్లను తాగితేనే బరువు తగ్గరు. వ్యాయామాలు చేస్తూ నీళ్లను పుష్కలంగా తాగితేనే మీరు సులువుగా బరువు తగ్గుతారు. 

బరువు తగ్గడానికి ఎంత నీటిని తాగాలి

ఒక వ్యక్తి రోజుకు కనీసం 1.5 నుంచి 2 లీటర్ల నీటిని తాగాలని నిపుణులు చెబుతున్నారు. వాటర్ మన శరీరంలోని విషాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. వాటర్ ఆకలిని తగ్గిస్తుంది. అలాగే మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఒకటి లేదా రెండు గ్లాసుల నీటిని తాగితే ఒత్తిడి తగ్గుతుంది. కేలరీల వినియోగం కూడా తగ్గుతుంది. 

నీటిని ఎప్పుడెప్పుడు తాగాలి?

  • ఫుడ్ ను తినడానికి ముందు ఒక గ్లాసు వాటర్ ను తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఆకలి చాలా వరకు తగ్గుతుంది.
  • కేలరీలను తగ్గించడానికి మంచి ఫుడ్ ను తినండి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. వీటితో పాటుగా 1.5 నుంచి 2 లీటర్ల నీటిని తాగండి.
  • ఉదయం లేచిన వెంటనే 500 మిల్లీ లీటర్ల నీటిని తాగండి. ఎందుకంటే ఇది రోజంతా మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. నిద్రపోయేటప్పుడు 8 నుంచి 9 గంటల గ్యాప్ తర్వాత నీటిని ఖచ్చితంగా తాగండి. 
  • భోజనంతో పాటుగా అనారోగ్యకరమైన పానీయాలకు బదులుగా నీటినే తాగండి. ఇది మీరు కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. 
  • వ్యాయామం చేయడానికి ముందు కూడా నీటిని ఖచ్చితంగా తాగండి. ఎందుకంటే ఇది సెషన్ అంతటా మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కొవ్వును కరించడానికి సహాయపడుతుంది.
  • మిల్క్ షేక్ లేదా చల్లని రసాలకు బదులుగా పనిచేసిన అలసిపోయిన తర్వాత నీటిని తాగండి. చల్లని పానీయాలు మన శరీరంలో కేలరీలను పెంచుతాయి. ఎందుకంటే వీటిలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది బరువును పెంచుతుంది.
  • కానీ భోజనం చేసిన వెంటనే ఎట్టి పరిస్థితిలో నీటిని తాగకూడదు. ఎందుకంటే దీనివల్ల పొట్ట ఉబ్బుతుంది. అలాగే ఫుడ్ ను జీర్ణం చేసే రసాలు పల్చబడతాయి. ఇది మలబద్దకానికి దారితీస్తుంది. ఒకవేళ అవసరమైతే కొన్ని నీళ్లను తాగొచ్చు.
  • ఇక రాత్రి విషయానికొస్తే నిద్రపోయే ముందు నీటిని తాగడం మంచిది కాదు. ఎందుకంటే ఇది మీకు రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తుంది. ఎందుకంటే తరచుగా టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుంది. 
Follow Us:
Download App:
  • android
  • ios