Asianet News TeluguAsianet News Telugu

రోజూ చింతపండు రసం తాగితే ఏమౌతుందో తెలుసా?

చింతపండుతో ఎన్నో రకాల వంటలను చేస్తుంటాం. కొంతమంది అయితే ప్రతి కూరలో చింతపండును వేస్తుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చింతపండు జ్యూస్ ను గనుక మీరు తాగినట్టైతే ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా?

 benefits of drinking tamarind juice everyday rsl
Author
First Published Aug 28, 2024, 2:50 PM IST | Last Updated Aug 28, 2024, 2:50 PM IST

కొంచెం తీయగా, కొంచెం పుల్ల పుల్లగా ఉండే చింతపండును మన దేశంలో బాగా ఉపయోగిస్తారు. చింతపండు ఫుడ్ కు డిఫరెంట్ టేస్ట్ ను ఇస్తంది. కొంతమంది ఈ చింతపండును కాయధాన్యాలు లేదా సూప్లలో వేసి తింటుంటారు. అయితే చింతపండు మాత్రమే కాదు దీని రసం కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న ముచ్చట మీకు తెలుసా? రోజూ చింతపండు రసాన్ని తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

జీర్ణక్రియకు..

చింతపండు జ్యూస్ ను తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలన్నీ నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చింతపండు రసం తాగితే మలబద్దకం, అజీర్ణం, కడుపు చికాకు వంటి సమస్యలన్నీ తొందరగా తగ్గిపోతాయి. 

బరువు తగ్గడానికి..

చింతపండు రసం కూడా మీరు బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. అవును చింతపండు రసం తాగితే శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు తొలగిపోతాయి. అలాగే ఈ రసం మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు హెవీగా తినలేరు.

ముఖ అందం

చింతపండు రసాన్ని తాగితే మీ అందం కూడా రెట్టింపు అవుతుంది తెలుసా? ఈ రసంలో ఉండే పోషకాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. దీనిలో ఉండే విటమిన్ సి మన చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ముఖ గ్లోను పెంచుతుంది.

గుండె ఆరోగ్యంగా..

చింతపండు జ్యూస్ ను రోజూ తాగితే గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

చింతపండు జ్యూస్ ఎలా తయారు చేయాలి 

చింతపండు రసాన్ని తయారు చేయాలంటే.. ముందుగా చింతపండును కడిగి దాని గింజలను తీసేయండి. ఇప్పుడు 2 గ్లాసుల నీటిని మరిగించి అందులో చింతపండును కలపాలి. దీన్ని కాసేపు మరిగించండి. దీన్ని జల్లెడతో వడకట్టి చల్లారిన తర్వాత తాగండి. అయితే ఈ రసం మరింత టేస్టీగా ఉండటానికి దీనిలో మీరు తేనెను కలుపుకోవచ్చు.  అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios