కరోనా లక్షణాలు ఏంటంటే.. జలుబు, దగ్గు, జ్వరం అని ఠక్కున చెబుతారు. అయితే ఈ జలుబే కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమేనట..

మీకు సీజన్ మరినప్పుడల్ల జలుబు చేస్తుందా? అయితే మీరు కరోనా నుండి సేఫ్ అంటున్నారు వైద్యులు. ఎలా అంటే... తరచుగా జలుబు రైనో, పారా ఇన్ ఫ్లుయోంజా వంటి వాటిలానే కొన్ని రకాల కరోనా వైరస్ ల వల్ల కూడా రావొచ్చు. అలాంటి జలుబు వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

దీనివల్ల కోవిడ్ వైరస్ నుంచి దీర్ఘకాలిక రక్షణ లభిస్తుందని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ మెడికల్ సెంటర్ కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు ఈ జలుబు వల్ల వచ్చే రోగనిరోధక శక్తితో కొన్నిసార్లు జీవితాంతం కొవిడ్ నుంచి రక్షణ లభించే అవకాశం కూడా ఉందని అంటున్నారు. 

గతంలో కరోనా వైరస్ కారణంగా జలుబు చేసిన రోగుల్ని పరిశీలించినప్పుడు ఆసక్తికర విసయం వెలులోకి వచ్చింది. కరోనా వైరస్ ను ఎదుర్కొనే రోగ నిరోధక వ్యవస్థలోని మెమొరీ బి కణాలు వైరస్ లను గుర్తు పెట్టుకుంటాయట. దాంతో ఆ రకమైన వైరస్లు మళ్లీ శరీరంలోకి ప్రవేశించగానే ఈ మెమొరీ బి కణాలు స్పందించి యాంటీ బాడీలను విడుదల చేస్తున్నాయట. 

ఈ కణాలు దశాబ్దాల తరబడి శరీరంలో జీవించి ఉంటాయి. ఫలితంగా గతంలో ఇతరత్రా కరోనా వైరస్ ల కారణంగా జలుబు చేసిన వాళ్లకి అంత త్వరగా కొవిడ్ రాకపోవచ్చు. ఒకవేళ కొవిడ్ వచ్చినా వాళ్ల మీద అంతగా ప్రభావాన్ని చూపించకపోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.