Asianet News TeluguAsianet News Telugu

ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా..? అరోమా థెరపీ ప్రయత్నించండి..!

ఈ వ్యాధులు మన దరిచేరకుండా ఉండాలంటే.. ముందుగా.. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆ ఒత్తిడిని కూడా.. కేవలం ఓ అరోమా థెరపీతో తగ్గించుకోవచ్చట. అసలు ఏంటీ అరోమా థెరపీ..? దీనితో ఒత్తిడి ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..
 

Aroma therapy: Perfect way to de-stress your body
Author
Hyderabad, First Published Jan 15, 2022, 2:38 PM IST

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడితో బాధపడుతున్నవారే. ఈ ఒత్తిడి ఒక్కటి చాలు.. మనకు సర్వ రోగాలు తెచ్చిపెట్టడానికి. ఈ ఒత్తిడి కారణంగా.. ఇతర అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టేస్తాయి. అయితే.. ఈ వ్యాధులు మన దరిచేరకుండా ఉండాలంటే.. ముందుగా.. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆ ఒత్తిడిని కూడా.. కేవలం ఓ అరోమా థెరపీతో తగ్గించుకోవచ్చట. అసలు ఏంటీ అరోమా థెరపీ..? దీనితో ఒత్తిడి ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

సువాసనలు, సెంట్ స్మెల్, అగరబత్తుల వాసనలు... మన మూడ్ మారుస్తాయి. ఒక్కసారిగా మనలో తెలియని ఆనందం కలుగుతుంది. దీన్నే అరోమాథెరపీ అంటారు. ఈ సెంట్ తైలాల్ని మొక్కల పూలు, మూలికలు, వేర్లు, ఆకులు నుంచి తయారుచేస్తారు. ఆ తైలాలు గాల్లో కలుస్తాయి. వాటిని మనం పీల్చినప్పుడు... మన బాడీలోకి అవి వెళ్లినప్పుడు... మన మైండ్ వాటిని గ్రహిస్తుంది. వాటిలో ఉండే సుగుణాలు... మన మెదడును శాంతపరుస్తాయి. భారాన్ని దించేస్తాయి. తేలికగా అయ్యేలా చేస్తాయి.

ఈ థెరపీ వల్ల కలిగే ఉపయోగాలేంటి..?

ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది
ఒత్తిడి లేదా ఆందోళన నుండి ఉపశమనం పొందడంలో సహాయపడటానికి అరోమాథెరపీని దాని ఏ రూపంలోనైనా ఉపయోగించవచ్చు. మైండ్‌ఫుల్‌నెస్ మరియు మెడిటేషన్ అనేది జీవన విధానంగా మారుతోంది . అరోమాథెరపీ మీకు ప్రశాంతంగా కూర్చోవడానికి, లోతుగా ఊపిరి పీల్చుకోవడానికి .. విశ్రాంతి తీసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇది అలసిపోయిన మనస్సులకు , ఒత్తిడితో కూడిన పరిస్థితులకు ఉపయోగించడానికి సరైనది, ఎందుకంటే ఇది నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది, మనస్సు సడలించడం , రక్తపోటును తగ్గిస్తుంది.

Aroma therapy: Perfect way to de-stress your body

నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది
మెదడు పనితీరు , జ్ఞాపకశక్తికి నాణ్యమైన నిద్ర చాలా అవసరం, లావెండర్, విశ్రాంతి , నిద్ర కోసం ఉపయోగించే అత్యంత ప్రసిద్ధ ముఖ్యమైన నూనెలలో ఒకటి. లేదా మీరు వెచ్చని స్నానానికి మీకు ఇష్టమైన ముఖ్యమైన నూనెను కూడా ప్రయత్నించవచ్చు 

అలసట 
ఈ  నూనెలు ప్రత్యేకమైన రసాయన లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వినియోగదారులు మరింత రిలాక్స్‌గా ఉండేందుకు కొన్ని మనస్సును ప్రభావితం చేస్తాయి, ఈ నూనెలు అలసటతో కూడా పోరాడగలవు. శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది  కండరాల సడలింపును అందించడం అలసట తగ్గుతుంది.

neroli oil(నెరోలీ ఆయిల్) : ఇది ఒత్తిడిని అమాంతం తగ్గించేస్తుంది. పని ప్రదేశంలో ప్రశాంతమైన ఫీల్ కలిగిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. ఈ తైలాన్ని ఒక్క చుక్కను ఏ టిష్యూ పేపర్ పైనో వేసి... మన దగ్గర (కంప్యూటర్ దగ్గర లేదా టేబుల్ పైన) పెట్టుకుంటే... కొన్ని క్షణాల్లో సువాసలు గాల్లో వస్తుంటాయి. అవి పీల్చేయాలి.

Basil oil (తులసి తైలం) : నెగెటివ్ ఆలోచనలను ఇది పోగొడుతుంది. వేడెక్కిన బుర్రను కూల్ చేస్తుది. ఏకాగ్రత పెరుగుతుంది. స్పష్టమైన ఆలోచనలు వస్తాయి. పని చెయ్యాలనే ఉత్సాహం కలుగుతుంది. ఓ గిన్నెలో కొద్దిగా నీరు తీసుకొని... అందులో ఓ చుక్క కంటే తక్కువే తులసి తైలం వెయ్యాలి. ఇప్పుడు ఓ టవల్ లేదా కర్చీఫ్ లాంటి క్లాత్‌ను నీటిలో ముంచాలి. ఆ క్లాత్ తడిగా ఉన్నా పర్వాలేదు... దాన్ని బాడీ లేదా ముఖంపై కప్పుకొని నిద్రపోవాలి. తెల్లారితే ఫుల్ ఖుషీగా ఉంటారు.

Rosemary oil (రోజ్ మేరీ ఆయిల్) : మెమరీ పవర్ తగ్గుతున్నా, చిరాకు పెరుగుతున్నా రోజ్ మేరీ తైలం బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎనర్జీని ఇస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచేస్తుంది. స్నానం చేసేటప్పుడు... ఓ రెండు చుక్కలు నీటిలో వేసుకొని... ఆ నీటితో స్నానం చేస్తే... సువాసనే సువాసన.

అంతెందుకు బాత్‌రూంలో చెడు వాసనలు వస్తుంటే... అక్కడ కూడా రోజ్ మేరీ తైలం రెండు చుక్కల్ని టాయిలెట్ పేపర్ పైనో, ఇంకెక్కడైనా వేసి ఉంచితే... ఆటోమేటిక్‌గా చెడు స్మెల్ పోయి సువాసన వెదజల్లుతుంది.

Lemon Oil (నిమ్మకాయ తైలం) : రకరకాల రోగాలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్నప్పుడు... నిమ్మకాయ ఆయిల్ యాంటీ వైరల్‌లా పనిచేస్తుంది. చాలా మంది దీన్ని డిఫ్యూజర్ (diffuser)లో వేసి వాడతారు. ఓ క్లాత్‌పై వేసు కూడా వాడొచ్చు.

Tea tree Oil (టీట్రీ ఆయిల్) : ఆఫీస్ లేదా ఇళ్లలోని ప్రదేశాలు, కీబోర్డ్స్, మౌస్, లంచ్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్, టెలిఫోన్స్ ఇలా వేటినైనా సరే... ఈ ఆయిల్ ఓ చుక్క నీటిలో వేసి... ఆ నీటిలో ఓ క్లాత్ ముంచి... దానితో శుభ్రం చేసుకుంటే... ఇల్లంతా పరిమళ భరితం అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios