Asianet News TeluguAsianet News Telugu

క్రాన్ బెర్రీలను రోజూ తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

క్రాన్ బెర్రీలు అద్బుతమైన పోషకాలకు మంచి వనరు. దీనిలో ఉండే పోషకాలు మనల్ని ఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

AMAZING HEALTH BENEFITS OF CRANBERRIES
Author
First Published Mar 21, 2023, 4:00 PM IST

క్రాన్ బెర్రీలు చిన్నగా ఉన్నా ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. క్రాన్బెర్రీస్ చిన్నగా, గుండ్రంగా, ఎర్రగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కాస్త చేదుగా, పుల్లగా ఉంటాయని చాలా మంది అంటుంటారు. మీకు తెలుసా ఈ పండులో విటమిన్ సి, ఫైబర్ లు పుష్కలంగా ఉంటాయి. మనల్ని అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచే ఫైటో-పోషకాలు ఈ పండులో మెండుగా ఉంటాయి. దంతాల కుహరం, మూత్ర మార్గ సంక్రమణ, తాపజనక వ్యాధుల నుంచి మనల్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు కూడా దీనిలో ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

ఎండిన క్రాన్ బెర్రీలల్లో కొన్ని విటమిన్లు తక్కువగా ఉంటాయి. వీటిలో కాల్షియం, పొటాషియంతో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..  క్రాన్ బెర్రీలను  మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో అద్బుత ప్రయోజనాలను పొందుతారు. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం.. 

క్రాన్ బెర్రీలలో ప్రోయాంతో సైనిడిన్స్ అని పిలువబడే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సహజ యాంటీ బాక్టీరియల్ ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఎస్చెరిచియా కోలి బ్యాక్టీరియా మూత్రాశయం, మూత్ర మార్గం లోపలి ఉపరితలానికి అంటుకోకుండా నిరోధించడానికి సహాయపడతాయి. ఇది సంక్రమణకు కారణమవుతుంది.

క్రాన్ బెర్రీలలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ మంట నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఇవి గుండె జబ్బుల నుంచి రక్షిస్తాయి. 

క్రాన్ బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే శక్తివంతమైన ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ ఇ, క్వెర్సెటిన్ ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టం నుంచి మన శరీరాన్ని రక్షించడానికి సహాయపడతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వృద్ధాప్య ప్రక్రియకు దారితీస్తాయి. అంతేకాదు దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. 

క్రాన్ బెర్రీల్లో విటమిన్ సి, సాలిసిలిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది.  క్రాన్ బెర్రీల్లో ఉండే విటమిన్ సి చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే ఇవి మన చర్మాన్ని యువి కిరణాల ఫోటోడామేజ్ నుంచి రక్షిస్తాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios