ప్రోటీన్లు ఎక్కువ ఉండే ఈ సూపర్ ఫుడ్స్ ఎంటో తెలుసా?

ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. ఫిట్ గా ఉండాలనుకునే వారు రోజూ అవసరమైన ప్రోటీన్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. అయితే మనకు అందుబాటు ధరల్లో దొరికే మంచి ప్రోటీన్ ఫుడ్ ఏంటో మీకు తెలుసా?

5 Affordable High Protein Foods Available at Home KVG

మనం ఆరోగ్యంగా ఉండాడనికి ప్రోటీన్ చాలా అవసరం. జిమ్ కి వెళ్లు వాళ్లు ప్రోటీన్ కోసం తరచూ షేక్స్, పౌడర్లు, డ్రింక్స్ తీసుకుంటారు. ఇవి చాలా ఖరీదైనవి. అందరూ కొనుక్కోలేరు కూడా. మరి తక్కువ ఖర్చులోనే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

ప్రోటీన్ కోసం ఈ ఫుడ్ ట్రై చేయండి

గుడ్డు:

- ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ ధరకు లభిస్తాయి.
- రోజూ 2, 3 గుడ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుంది.
- ఉడికించిన గుడ్లు లేదా ఆమ్లెట్ ని ఆహారంలో చేర్చుకోవచ్చు.

పాలు:
- పాలల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, ఇది కండరాలను బలపరుస్తుంది.
- షేక్స్, స్మూతీస్ లేదా పాలను నేరుగా తాగవచ్చు.

పప్పులు, బీన్స్:5 Affordable High Protein Foods Available at Home KVG

  • పెసలు, మినుములు, శనగపప్పు, రాజ్మా లాంటి బీన్స్ ప్రోటీన్ కి మంచి ఆహారాలు.
  • కూర, సూప్ లేదా సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.

సత్తు:

  • సత్తులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, తేలికగా జీర్ణమవుతుంది.
  • సత్తు శరబత్ లేదా పరాఠా చేసుకుని తినొచ్చు.

జొన్న, రాగులు:

  • ఈ చిరుధాన్యాలు ప్రోటీన్ తో పాటు ఫైబర్ కూడా అందిస్తాయి.
  • రొట్టె, కిచిడీ లేదా గంజి రూపంలో తీసుకోవచ్చు.

గమనిక:

  • సహజ ప్రోటీన్ ఆహారాలు చవకైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచివి.
  • రోజూ వీటిని తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది.
  • మంచి ఫలితాల కోసం ప్రోటీన్ తో పాటు ఇతర పోషకాలు కూడా తీసుకోవాలి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios