బరువు తగ్గడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని సహజ పద్ధతులు పాటిస్తే, సులువుగా, తొందరగా బరువు తగ్గొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని పదార్థాలు తింటే మంచి ఫలితాలు ఉంటాయట. అవెంటో చూసేయండి మరి.
బరువు తగ్గడం చాలా పెద్ద టాస్క్. చాలామంది బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో చూసి డైట్, ఎక్సర్సైజులు చేస్తుంటారు. కానీ సహజ పద్ధతులతో కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం, సహజంగా దొరికే కొన్ని పదార్థాలను ఖాళీ కడుపుతో తినడం ద్వారా కొవ్వు ఇట్టే కరుగుతుందట. ఆ పదార్థాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమలాల్సిన పదార్థాలు:
1. మెంతులు:
మెంతుల్లో కొవ్వు కరిగించే ఫైబర్ ఎక్కువ. ఇది జీవక్రియను పెంచి, కొవ్వును ఫాస్ట్ గా కరిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్లు బరువు తగ్గడానికి మెంతులు బాగా పనిచేస్తాయి. ఒక టీస్పూన్ మెంతుల్ని రాత్రి నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో నమలండి. మెంతుల్ని ఖాళీ కడుపుతో తింటే, ఎక్కువసేపు ఆకలి వేయదు. ఆ నీళ్లు కూడా తాగొచ్చు. ఇది శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తుంది.
2. తులసి ఆకులు:
తులసి ఒక నేచురల్ డిటాక్స్ లా పనిచేస్తుంది. ఇది లివర్ పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థాల్ని తీసేసి, కొవ్వును కరిగించే ప్రాసెస్ ను పెంచుతుంది. బరువు కంట్రోల్ చేయడానికి, శరీరంలో నీరు నిల్వ ఉండకుండా చేస్తుంది. 3-5 తులసి ఆకుల్ని నమలండి. ఇది కడుపుని శుభ్రంగా ఉంచుతుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తులసి ఆకుల్ని అల్లం లేదా తేనెతో కలిపి నమిలితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
3. బాదం:
బాదం మంచి కొవ్వు, ప్రోటీన్ ఉన్న ఫుడ్. ఇది కొవ్వును శరీరానికి కావాల్సిన ఎనర్జీగా మారుస్తుంది. ఎక్కువ తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఎక్కువ కొవ్వును తగ్గించి, కండలు పెంచడానికి ఇది చాలా ముఖ్యం. 5-7 బాదం పప్పుల్ని రాత్రి నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి నమలండి. ఇది ఆకలిని తగ్గించి, ఎక్కువసేపు నీరసం లేకుండా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. బాదంతో పాటు వాల్ నట్స్ లేదా పిస్తా కలిపితే ఆరోగ్యానికి ఇంకా మంచిది.
ఈ 3 పదార్థాలు బరువు తగ్గడానికి ఎలా హెల్ప్ చేస్తాయి?
జీవక్రియను పెంచుతాయి:
మెంతులు, తులసి, బాదం శరీరంలో కొవ్వును కరిగించే ప్రాసెస్ ను పెంచడానికి హెల్ప్ చేస్తాయి.
ఆకలిని కంట్రోల్ చేస్తాయి:
మెంతులు, బాదం ఎక్కువసేపు ఆకలి వేయకుండా, పదే పదే తినే అలవాటును తగ్గిస్తాయి.
శరీరాన్ని డిటాక్స్ చేస్తాయి:
తులసి వ్యర్థాల్ని బయటకు పంపి, లివర్ ను శుభ్రం చేసి, బరువును కంట్రోల్ చేస్తుంది.
షుగర్ కంట్రోల్:
మెంతులు, బాదం ఇన్సులిన్ జీర్ణక్రియను కరెక్ట్ గా ఉంచుతాయి. దీనివల్ల షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి?
* గర్భిణీలు – మెంతులు ఎక్కువ తినకూడదు.
* కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్లు – బాదం మోతాదుకు మించి తినకూడదు.
* కిడ్నీ సమస్య ఉన్నవాళ్లు – ఎక్కువ ఫైబర్ తీసుకోవడానికి ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి.