Asianet News TeluguAsianet News Telugu

బీపీ కంట్రోల్ లో ఉండాలంటే...

రక్తపోటు తగ్గటానికీ కొబ్బరినీరు ఉపయోగపడుతుంది. ఇందులో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం దండిగా ఉంటుంది. 

10 ways to control high blood pressure without medication
Author
Hyderabad, First Published Feb 6, 2021, 3:05 PM IST

అధిక రక్తపోటుతో రక్తనాళాలు దెబ్బతినటం, పక్షవాతం, కిడ్నీజబ్బు వంటి ఇబ్బందులు పొంచి ఉంటాయి. అందువల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవటం ఎంతో అవసరం. క్రమం తప్పకుండా మాత్రలు వేసుకోవటం మానరాదు. ఇవే కాదు కొన్ని చిట్కాలూ రక్తపోటు అదుపులో ఉండేందుకు తోడ్పడతాయి.

కొన్ని ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే రక్తపోటు సాధారణంగా ఉండేలా చూసుకోవచ్చు. మరి ఈ విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు  చూద్దాం..

రక్తపోటు తగ్గటానికీ కొబ్బరినీరు ఉపయోగపడుతుంది. ఇందులో కేంద్ర నాడీవ్యవస్థను ప్రశాంతంగా ఉంచేందుకు, రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడేందుకు తోడ్పడే పొటాషియం దండిగా ఉంటుంది. సుమారు 600 మిల్లీలీటర్ల కొబ్బరినీరుతో 1,500 మి.గ్రా. పొటాషియం లభిస్తుంది.

సోడియం, పొటాషియం సమతౌల్యం కోసం శుద్ధి చేయని నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు వాడాలి. తెల్లని ఐయోడైజ్డ్‌ ఉప్పులో సోడియం మాత్రమే ఉంటుంది. ఆ ఉప్పులో పొటాషియం ఉండదు.

బాగా వేగించిన ఆహారపదార్ధాలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ పోషకాలను గ్రహించనీయవు. ఈ ఫుడ్స్‌ సోడియం, పొటాషియం శాతాన్ని, నీటి శాతాన్ని మారుస్తాయి. దీని ఫలితంగా రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తాయి.

ఇంటి వద్ద తయారుచేసుకున్న పచ్చళ్లలో ఉండే ఆరోగ్యకర బ్యాక్టీరియా రక్తపోటును అదుపులో ఉంచడంలో సాయపడుతుంది. అలాగే రకరకాల చిరు, పప్పు ధాన్యాలతో తయారైన పాపడ్స్‌లోని నల్ల మిరియాలు, జీలకర్ర ఆరోగ్యానికి మంచి చేస్తాయి.

రక్తపోటు అదుపులో ఉంటే చాలా అనారోగ్యాలు దరిచేరవు. సరిపోను నిద్ర, విశ్రాంతి శరీరానికి చాలా అవసరం. రోజూ కాసేపు నడవడం వల్ల రక్తపోటు సాధరణంగా ఉంటుంది. కార్డియో, యోగ వంటి వ్యాయామాలు దీర్ఘకాలికంగా రక్తపోటును నియంత్రిస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios