బరువు తగ్గడానికి చాలామంది జిమ్ కి వెళ్తుంటారు. అక్కడ పరికరాలతో కుస్తి పడుతుంటారు. కానీ ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా.. ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గే కొన్ని సింపుల్ వ్యాయామాలు ఉన్నాయి. అవేంటో.. వాటి ప్రయోజనాలేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది జిమ్ కి వెళ్లి.. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే.. మరికొందరు ఆ పరికరాలను కొని ఇంట్లోనే వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ఎలాంటి పరికరాల అవసరం లేకుండా కూడా బరువు తగ్గవచ్చు. కొన్ని సింపుల్ వ్యాయామాలతో ఇది సాధ్యమవుతుంది. ఆ వ్యాయామాలేంటో.. వాటి ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పరికరాలు లేకుండా చేయగలిగే వ్యాయామాలు
1. జంపింగ్ జాక్స్
జంపింగ్ జాక్స్ అనేది కార్డియో వ్యాయామం. ఇది హార్ట్ బీట్ రేటును పెంచుతుంది. కేలరీలను త్వరగా బర్న్ చేస్తుంది. 30 సెకన్ల నుంచి ఒక నిమిషం వరకు సెట్ లుగా చేయాలి. ప్రతి సెట్ కి మధ్య చిన్న గ్యాప్ తీసుకోవాలి. మీ ఫిట్ నెస్ పెరిగే కొద్దీ సమయాన్ని పెంచుకోవచ్చు.
2. స్క్వాట్స్
స్క్వాట్స్ చేయడం వల్ల చాలా లాభాలున్నాయి. తుంటి కండరాలు బలపడతాయి. రెగ్యులర్ గా స్క్వాట్స్ చేయడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఈజీగా బరువు తగ్గవచ్చు.
3. పుష్-అప్స్
పుష్-అప్స్ ఛాతీ, భుజాలు, చేతులు, కోర్ కండరాలను బలోపేతం చేస్తాయి. వీటికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. పుష్ అప్స్ కేలరీలు బర్న్ చేయడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. కొత్తగా ప్రారంభించేవారు మోకాళ్లపై పుష్ అప్స్ చేయడం మంచిది. క్రమంగా మార్చుకోవచ్చు.
4. లంజెస్
లంజెస్.. కాళ్ల కండరాలను బలోపేతం చేయడానికి, శరీర సమతుల్యతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వీలైనంతవరకు లంజెస్ చేసేటప్పుడు శరీర బరువును రెండు కాళ్లపై సమానంగా పడేలా చూసుకోవాలి.
5. ప్లాంక్
శరీరాన్ని నేలకు సమాంతరంగా ఉంచి.. చేతులు, కాళ్లపై బరువు మోపుతూ చేసే వ్యాయామం ప్లాంక్. ఇది పొట్ట, వీపు, నడుము కండరాలను బలోపేతం చేస్తుంది. నడుము లేదా భుజాల నొప్పి ఉన్నవారు ఈ వ్యాయామం చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
6. మౌంటెన్ క్లైంబర్స్
మౌంటెన్ క్లైంబర్స్.. ఛాతీ, భుజాలు, కోర్, తుంటి కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ముందు ప్లాంక్ వ్యాయామంలా చేతులు చాచి, నేలపై ఉంచాలి. మీ చేతులు మీ భుజాల కింద నేరుగా ఉండాలి. శరీరం తల నుంచి మడమల వరకు సరళ రేఖలో ఉండాలి.
7. బర్పీస్
ఇంట్లో ఈజీగా చేయగలిగే వ్యాయామాల్లో బర్పీస్ ఒకటి. ఇవి చేయడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. ఈ వ్యాయామం ఎముకల బలోపేతానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
8. గ్లూట్ బ్రిడ్జెస్
గ్లూట్ కండరాలు శరీరానికి చాలా ముఖ్యమైనవి. ఇవి నడవడం, పరుగెత్తడం, ఇతర కదలికలకు సహాయపడతాయి. గ్లూట్ బ్రిడ్జ్ వ్యాయామం ఈ కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేకాదు మొత్తం శరీర పనితీరు మెరుగుపడడానికి సహాయపడుతుంది.
9. సైకిల్ క్రంచెస్
సైకిల్ క్రంచెస్ వ్యాయామం చేయడం వల్ల కోర్ కండరాలు బలోపేతమవుతాయి. శరీర సమతుల్యత పెరుగుతుంది. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి, కడుపు కండరాలను టోన్ చేయడానికి ఈ వ్యాయామం చక్కగా సహాయపడుతుంది.
10. హై నీస్
హై నీస్ వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీర కొవ్వును తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది.
