MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • Meditation Benefits: ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు!

Meditation Benefits: ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు!

ధ్యానం.. మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి చాలా సమస్యలను దూరం చేస్తుంది. రోజూ కాసేపు ధ్యానం, యోగా చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ ఈజీగా చేయగలిగే కొన్ని యోగాసనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Kavitha G
Published : Aug 13 2025, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Meditation Benefits:
Image Credit : Gemini

Meditation Benefits:

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఉద్యోగం, వ్యాపారం, చదువు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఇలా ఏదో ఒకటి మనల్ని ఒత్తిడికి గురిచేస్తోంది. మరి వాటినుంచి మనసుకు శాంతి, శరీరానికి విశ్రాంతి కలిగించేందుకు ధ్యానం (Meditation), యోగా అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ధ్యానం వల్ల కలిగే లాభాలు
Image Credit : Getty

ధ్యానం వల్ల కలిగే లాభాలు

ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒత్తిడి తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనా శక్తి పెరుగుతుంది. శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్ర లేమి సమస్య నుంచి ఉపశమనం దక్కుతుంది. రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాదు కోపం, ఆందోళన వంటి భావోద్వేగాలపై నియంత్రణకు ధ్యానం చక్కగా సహాయపడుతుంది. 

34
ఇంట్లో సులభంగా చేయగలిగే యోగాసనాలు
Image Credit : Freepik

ఇంట్లో సులభంగా చేయగలిగే యోగాసనాలు

ప్రాణాయామం (శ్వాస నియంత్రణ)

ప్రాణాయామం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. మెల్లగా శ్వాస తీసుకుని, మెల్లగా వదలాలి. రోజూ 5 నుంచి 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది. 

అణులోమ విలోమ ప్రాణాయామం

అణులోమ విలోమ ప్రాణాయామం ద్వారా శరీరంలోని నాడులు శుద్ధి అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ముక్కు కుడి వైపు రంధ్రాన్ని వేలితో మూసి.. ఎడమ వైపు రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. మళ్లీ ఎడమ వైపు రంధ్రాని మూసి.. కుడి వైపు రంధ్రంతో శ్వాస తీసుకొని వదలుతూ కొనసాగించాలి. 

శవాసనా 

శవాసనా.. శరీరానికి పూర్తిగా విశ్రాంతినిచ్చే ఆసనం. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర పోజిషన్‌లో.. కళ్లు మూసుకొని 5–10 నిమిషాలు మౌనంగా ఉండాలి.

44
సూర్య నమస్కారాలు
Image Credit : our own

సూర్య నమస్కారాలు

సూర్యుడికి నమస్కరించే ప్రక్రియను సూర్య నమస్కారాలు అంటారు. సూర్య నమస్కారాల వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.  

యోగా చేసేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు

  • ఖాళీ కడుపుతో చేయడం ఉత్తమం.
  • ఒకే సమయానికి చేయడం అలవాటు చేసుకోండి.
  • మొదటి రోజు 5 నిమిషాలతో ప్రారంభించి, టైంని పెంచుకోండి.
  • మొబైల్, టీవీ వంటి అంతరాయాలు లేకుండా ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. 

ధ్యానం, యోగా జీవన శైలిని మెరుగుపరిచే సాధనాలు. రోజుకు కేవలం 15 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image2
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image3
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Related Stories
Recommended image1
Health Tips: భోజనం చేసిన తర్వాత బెల్లం తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image2
Health Tips: 40 ఏళ్లు దాటినవారు కచ్చితంగా తినాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved