జానీ వాకర్ రెడ్డి కూడా జగన్ ను విమర్శించేవాడే: వైసిపి ఎమ్మెల్యే సెటైర్లు
ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డిపై వైసిపి ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. రెండు పెగ్గులు వేస్తే ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్ధంకాదని ఎద్దేవా చేశారు.
తాడేపల్లి: రాయలసీమకు పట్టిన శని చంద్రబాబు నాయుడేనని వైసీపీ ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారా జరుగుతుందని...సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు ఉండాలని జగన్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంంధ్ర ప్రదేశ్ లో కేవలం హైదరాబాద్ లోనే అభివృద్ది జరిగిందన్న చంద్రబాబు ఈసారి అలా జరగనివ్వనని అన్నారని గుర్తుచేశారు. కానీ దానిపై కూడా యూటర్న్ తీసుకుని అమరావతికే పూర్తి డెవలప్ మెంట్ ను పరిమితం చేయడానికి ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన జగన్ రాజధాని మార్పుకు శ్రీకారం చుట్టారని వివరించారు.
హైదరాబాద్ లాగే అమరావతిని చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. అభివృద్ధి కేవలం హైదరాబాద్ లో కేంద్రీకృతం కావడం వలనే రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
read more ఆ వైసిపి నాయకులకు విశాఖలో ఆరు వేల ఎకరాలు...: దేవినేని ఉమ సంచలనం
రాయలసీమ బిడ్డలుగా ఎన్నో సార్లు చంద్రబాబును హైకోర్టు రాయలసీమలో పెట్టాలని కోరామని... ఇదే ప్రాంతానికి చెందినవాడయినా తమ వినతిని ఆయన పట్టించుకోలేదన్నారు. రాయలసీమకు చెందిన చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి కూడా తమ ప్రాంతానికి ఏం చేయలేదని... అందువల్లే అన్ని విషయాల్లో వెనుకబడిపోయామని అన్నారు.
చంద్రబాబు రాయలసీమ ప్రజలను మాయ మాటలతో మోసం చేశారని ఆరోపించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ కరువు పోయిందన్నారు. ఇప్పుడు కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందేమోనని...అలా రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
కొన్ని మొరిగే కుక్కలను పక్కన పెట్టుకుని చంద్రబాబు సీఎంపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబుకు ఇక్కడే మూడు సీట్లు వచ్చాయంటే గత ప్రభుత్వ పాలన ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు. రాయలసీమ ప్రజల ఆకాంక్షను జగన్ నెరవేర్తుస్తున్నారన్న నమ్మకం అందరిలో వుందని...అందుకే భారీ మెజారిటీ అందించారని పేర్కొన్నారు.
video: ఎన్నార్సీపై వైసిపి ప్రభుత్వ విధానమిదే: అంజాద్ బాషా
సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నట్లు రవిచంద్ర గుర్తుచేశారు. జిఎన్ రావు కమిటీ నివేదిక కూడా ప్రజాభిప్రాయం మేరకే వస్తున్నదని భావిస్తున్నామన్నారు. రాజధానిపై జగన్ నిర్ణయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజధానిలో తాను, తన బినామీలు, అనుచరులు కొన్న భూములకు రేట్లు తగ్గిపోతాయని భయంతోనే చంద్రబాబు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని ఆయన పేరుతో పిలవాలో లేక జానీ వాకర్ దివాకర్ రెడ్డి అనాలో అర్ధం కావడంలేదన్నారు. రెండు పెగ్గులు వేస్తే ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్ధం కాదని రవిచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.