video: ఎన్నార్సీపై వైసిపి ప్రభుత్వ విధానమిదే: అంజాద్ బాషా

కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చిన  ఎన్నార్సీ ముస్లీం సమాజానికి ఇబ్బందులు కలిగించేలా వుంటే వారి తరపున పోరాడేందుకు వైసిపి సిద్దమేనని డిప్యూటి సీఎం అంజాద్ బాషా తెలిపారు.  

ap deputy cm amzad basha reacts on NRC act

అమరావతి: వారం నుంచి ఎన్నార్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొందని... వీటని తాము గమనిస్తున్నామని డిప్యూటి సీఎం అంజాద్ బాషా తెలిపారు. తమ పార్టీ ముస్లింల పక్షాన నిలబడుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఉప ముఖ్యమంత్రిగా స్పష్టంగా చెప్తున్నానని అన్నారు.  

వైఎస్సార్ ముస్లీం, మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని గుర్తుచేశారు. అయితే జగన్ తండ్రిని మించిపోయి మైనారిటీల కోసమే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. 

వీడియో

"

ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విదంగా తనను డిప్యూటీ సీఎం చేశారని తెలిపారు. 2019లో 5 మందికి టికెట్స్ ఇచ్చారని...ఇక్బాల్ ఓడినా ఎమ్మెల్సీ చేశారన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చారిత్రక నిర్ణయం తీసుకున్నారని... 50 శాతం రిజర్వేషన్ల చట్టం చేసి మాకు న్యాయం చేశారని ప్రశంసించారు. 

READ MORE ఉపాధి పనుల్లో ఇసుక కొరత వుంటే ఏ చేయాలంటే: అధికారులకు మంత్రి సూచన

నారా హమారా మీటింగులో మైనారిటీలపై దేశద్రోహం కేసు పెడితే సీఎం జగన్ తాజాగా దాన్ని ఎత్తివేయించారని తెలిపారు. హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు 60 వేల రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇమామ్, మౌజూమ్ లకు మార్చి 1 నుంచి 15 వేల గౌరవ వేతనం ఇవ్వబోతున్నట్లు తెలిపారు. 

వక్ఫ్ భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు, మదరసా పిల్లలకూ అమ్మఒడి అందించేందకు సీఎం ఒప్పుకున్నారని తెలిపారు. ఎన్నార్సీ పై ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్ళామని...వైఎస్సార్ కాంగ్రెస్ ముస్లింల వెనుక ఉంటుందని ఆయన చెప్పారు. 

ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని సీఎం చెప్పారన్నారు. ఏదయినా అన్యాయం జరిగితే కేంద్రాన్ని ప్రశ్నించేందుకు సిద్దంగా వుంటానని జగన్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎక్కడ ముస్లింలకు అన్యాయం జరిగినా పోరాటానికి తమ పార్టీ ముందుంటుందని...రాజ్యసభ, లోక్ సభలోనూ ప్రొటెస్ట్ చేయడానికి వెనుకాడబోమని డిప్యూటీ సీఎం తెలిపారు. 

READ MORE రైతు భరోసా కేంద్రాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు... ఎలా పనిచేయనుందంటే

ఎన్నార్సీపై నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా పాల్గొన్నారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios