అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పేరుతో టిడిపి ప్రభుత్వం పెద్దక స్కామ్ చేసిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. రాజధాని  అభివృద్ది పేరు చెప్పి అమరావతిని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. అలా స్కాంలో వేల కోట్లు కాజేసిన టీడీపీ నాయకులే ఇప్పుడు అమరావతిని సందర్శిస్తున్నారని అంబటి ఆరోపించారు.

వారు నిర్మించింది అమరావతి కాదు ఒక బ్రమరావతి అని ఆయన సెటైర్లు విసిరారు. రాజధాని నగరాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా తీర్చిదిద్దామని చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ ముందు ప్రపంచ దేశాలు ఏమాత్రం నిలబడవని ఎద్దేవా చేశారు. అందుకు అమరావతే నిదర్శమని అన్నారు. 

ఇక సచివాలయం, హైకోర్టును తాత్కాలికంగా నిర్మించారని గుర్తించారు. అసలు రాజధాని అమరావతికి గెజిట్ గానీ నోటిఫికేషన్ గానీ ఇచ్చారా అని ప్రశ్నించారు. దేశ చిత్రపటంలో అమరావతి లేకపోవడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. 

చెడ్డి గ్యాంగ్ ఇళ్లపై పడి దోచుకుంటునట్లుగానే టీడీపీ నేతలు అమరావతి బైలిదేరారనని అన్నారు. వారు నిర్మించిన  ప్రభుత్వ కార్యాలయాల్లో బైట ఐదు సెంటిమిటర్లు వర్షం పడితే లోపల పది సెంటిమిటర్లు వర్షం నిలువ ఉంటుందన్నారు.

read more  బదిలీ ఎఫెక్ట్: ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన నిర్ణయం

స్విస్ చాలెంజ్ పై కోర్టు కు వెళ్ళింది జనసేన నాయకుడు తోట చంద్రశేఖరేనని...ఈ విషయాన్ని ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలన్నారు. కిలోమీటర్ కు ఏడూ కోట్లు ఖర్చు చేశారని...రాజధాని చుట్టు టీడీపీ నేతలు భూముల కొన్నారని ఆరోపించారు. అమరావతి కంటే వెనుక శంకుస్థాపన చేసిన టీడీపీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది...కానీ రాజధాని మాత్రం పూర్తి కాలేదన్నారు.

రాజధానిలో ఒక శాశ్వత కట్టడమైన కట్టారా... అని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు విదేశాల్లో ఉన్నవారే నమ్ముతారన్నారు. పవన్ ఈ మధ్య కామెడీ గా మాట్లాడుతున్నారు కాబట్టి మాకందరికి ఎంతో ఇష్టమన్నారు. 

సీఎం గురించి పవన్ అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయన సీఎం హోదాలో వున్న జగన్  గురించి మాట్లాడితే తప్పులేదు... కానీ తాము మాత్రం ఆయన గురించి మాట్లాడకూడదట...ఇదెక్కడి విడ్డూరమన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రమే హీరో... రాజకీయాల్లో పెద్ద విలన్ అని అన్నారు.

read more  డిజిపికీ సీఎస్ గతే... జగన్ కూడా కాపాడలేరు..: చంద్రబాబు

 మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి ఇంటికి చంద్రబాబు నాయుడు వచ్చారు...అంతమాత్రాన చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి మీద విమర్శలు చేయలేదా అని ప్రశ్నించారు. అలాగే తమ ఇంట్లో పెళ్లికి పవన్ కళ్యాణ్ నే కాదు టీడీపీ నేతలు కూడా చాలా మంది వచ్చారన్నారు. తనపై ఫ్యాక్షనిస్ట్ అని కొందరు విమర్శలు చేస్తున్నారని...అలాంటి వారు సత్తెనపల్లికి వెళ్లి అడిగితే అక్కడి ప్రజలు నిమేంటో చెపుతారన్నారు. 

తన గురించి భయపడి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేశారని... రెండు చోట్లా తుక్కు తుక్కుగా ఓడిపోయారన్నారు.   జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పవన్ కళ్యాణ్ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. చిరంజీవి వలన పవన్ కళ్యాణ్ హీరో అయ్యారన్నారు.రాజకీయాల్లో చంద్రబాబు విలన్ అయితే, పవన్ కళ్యాణ్ సైడ్ విలన్, లోకేష్ బుడ్డ విలన్ అని అన్నారు. 

పవన్ కళ్యాణ్ కంటే వెయ్యి రేట్లు నోరు తమకుందన్నారు. పవన్ రెండు చోట్ల ఎమ్మెల్యే గా ఓడిపోతే తాను రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిశానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ వ్యవహరిస్తున్నారని అంబటి విమర్శించారు.