మండలి ఛైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు... బొత్సపై మండిపడ్డ యరపతినేని

శాసనమండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొత్స సత్యనారాయణపై టిడిపి మాజీ  ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. 

yarapathineni srinivasrao fires on botsa satyanarayana

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ శాసనమండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. వైసిపి హయాంలో రాష్ట్రంలో వీధి రౌడీల పరిపాలన సాగుతోందని ఆరోపించారు. పవిత్రమైన అసెంబ్లీలో మంత్రుల మాట్లాడే బాష చాలా అసభ్యకరంగా ఉందని మండిపడ్డారు.

రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే ఉంచాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ప్రజాభిష్టాన్ని కాదని వైసిపి ప్రభుత్వం,  నాయకులు చేస్తున్న ఆరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 

read more  పోతుల సునీత అమ్ముడుపోయి రోజుకూలిగా మారిపోయారు..: వంగలపూడి అనిత

ఎన్ని అడ్డంకులు సృష్టించిన, ఎన్నీ కేసులు బనాయించినా  రాజధాని అమరావతికి మద్దతుగా టీడీపీ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసిపి పార్టీకి చెందిన 30మంది శాసనసభ్యులను  గెలిపిస్తే అమరావతి వద్దు మూడు రాజధానులే ముద్దంటున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ వైసిపి శాసనసభ సభ్యులకు తగిన గుణపాఠం ప్రజలే చెబుతారని విమర్శించారు. 

టీడీపీ కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన భయపడబోరని...  వారికి అండగా ఎప్పుడూ పార్టీ ఉంటుందన్నారు. పార్టీని కాపాడుతున్న కార్యకర్తలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం నాయకుడిపై వుందన్నారు. వారికి అన్నివిధాలుగా సహకారం అందింస్తామని... అధికారపార్టీ బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని మాజీ ఎమ్మెల్యే యరపతినేని కార్యకర్తలకు అభయమిచ్చారు.

మీడియాపై నిర్భయ కేసులు... జగన్ సర్కారు పనే: కొల్లు రవీంద్ర

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios