Asianet News TeluguAsianet News Telugu

పోతుల సునీత అమ్ముడుపోయి రోజుకూలిగా మారిపోయారు..: వంగలపూడి అనిత

టిడిపి నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల  సునీతపై మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తీవ్ర స్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. 

vangalapudi anitha shocking comments on pothula sunitha
Author
Amaravathi, First Published Jan 24, 2020, 8:16 PM IST

గుంటూరు: భ్రష్టు పట్టిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని జగన్‌ పంచన చేరిన నాడే ఎమ్మెల్సీ పోతుల సునీత విలువల రాజకీయం మర్చిపోయారని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శించారు. మాస్టారు మారితే క్రమశిక్షణ ఉల్లంఘించడం, ప్రవర్తన కట్టుదప్పుతుందన్నట్లు ఆమె తీరు వుందని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకూ తెలుగుదేశంలో ఉన్న సునీత నిబద్ధతతో సమాజం పట్ల సేవాదృక్పథంతో వ్యవహరించారని... వైసిపి తీర్థం పుచ్చుకోగానే అన్ని అవలక్షణాలు పుణికిపుచ్చుకున్నట్లు విదితమవుతోందని విమర్శించారు. 

టిడిపి ఎమ్మెల్సీల నైతిక ప్రవర్తన, నిజాయితీ, చట్టాల పట్ల గౌరవం, హక్కులను కాపాడటం పట్ల సునీత విపరీతార్థాలు తీయడం దారుణమన్నారు. సీఆర్డీఏ రద్దు, రాజధాని విభజన బిల్లులతో రైతుల బతుకులపై సమిధులుగా మారిన సందర్భంలో ఎమ్మెల్సీలు నిబంధనల మేరకే ఆమోదించకుండా వాటిని సెలక్ట్‌ కమిటీకి పంపితే సునీతకు తప్పుగా భావించడంలోనే ఆమె మారిన వైఖరి తేటతెల్లం అవుతోందన్నారు.  

మీడియాపై నిర్భయ కేసులు... జగన్ సర్కారు పనే: కొల్లు రవీంద్ర

మండలి లాబీల్లో విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు అడ్డగోలుగా మంత్రులకు కాగితాలు విసరడం, మాట్లాడటాన్ని సునీత సమర్థించడంలోనే ఆమె డబ్బుకు అమ్ముడు పోయిందని అర్థమవుతోందన్నారు. టిడిపి ఎమ్మెల్సీలు ప్రజాసామ్యాన్ని బతికించారని ప్రజలంతా హర్షిస్తుంటే ఆమెకు కంటగింపుగా ఉందా? అని  ప్రశ్నించారు. 

శాసన మండలి చైర్మన్‌ షరీఫ్‌ ను మంత్రులు కట్టడి చేయడం, దుర్భాషలాడటం, బెదిరించడాన్ని లైవ్‌ టెలీకాస్ట్‌ ని చూపించకపోయినా లోకమంతటికీ వైసిపి చేసిన అరాచకం  విదితమేనన్నారు. చట్టసభల గౌరవాన్ని ధైర్యంగా కాపాడిన మండలి చైర్మన్‌ ను అభినందించాల్సి పోయి వైసిపిలో చేరి మంత్రుల భాషను సునీత ఒక్కరోజులోనే  నేర్చుకోవడం దురదృష్టకరని అనిత అన్నారు.

read more  చంద్రబాబు అలా చేయడం బాధించింది... అందుకే బయటకు...: పోతుల సునీత

దేశంలో ఎక్కడా లేని మూడు రాజధానులను జగన్‌ మొండితనంగా ముందుకు తీసుకు వెళ్లాలన్న విధానాన్ని ప్రజలు, కోర్టులు ముక్తకంఠతో వ్యతిరేకిస్తున్న విషయాన్ని సునీత గమనించాలన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టుల సంతలో చేరి రోజుకూలీలుగా మారి జగన్‌ ఇచ్చిన కాగితాన్ని బట్టీపట్టి విలేకరుల ముందు చదవడానికి కూడా తడబడటం చూశామని పేర్కొన్నారు.వాస్తవ విరుద్ధంగా వ్యవహరించడంతో గొంతులో వెలక్కాయ పడినట్లయిందన్నారు.

ఎనిమిది నెలలుగా సవాలక్ష తప్పులతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుగున్న వైసిపి లో చేరడం కుడితిలో పడ్డ ఎలుక చందంగానే భావించాలని సునీతకు మనవి చేస్తున్నట్లు అనిత వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios