జగన్ జైలుకెళ్లకుండా వుండాలంటే ఈశాన్యంలో రాజధాని...అందుకే విశాఖ: వర్లరామయ్య
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు జాతకాల పిచ్చి ఎక్కువయ్యిందని... అందువల్లే ఎవరో స్వామీజి చెప్పారని ఏకంగా రాజధానినే మార్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య వెల్లడించారు.
అమరావతి: తాను అనుకున్నది చేయడం కోసం సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎంతకైనా తెగిస్తాడని... అందులో భాగంగానే రాజధానిని తరలిస్తున్నాడని టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య అన్నారు. రాజధాని మార్పు కోసం విలువలు, విశ్వసనీయత లేని రెండు బోగస్ కమిటీలను ఆయన నియమించాడని ఆరోపించారు.
బుధవారం ఆయన ఆత్మకూరులో ని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తమమాట వింటాడు.. చెప్పింది చేస్తాడనే జగన్ ప్రభుత్వం జీ.ఎన్.రావు సారథ్యంలో కమిటీ వేసిందని, ఆ కమిటీ పనికిమాలిన దొంగ నివేదిక ఇచ్చిందని వర్ల తేల్చిచెప్పారు. ప్రభుత్వం నియమించిన జీ.ఎన్.రావు కమిటీకి ఏవిధమైన చట్టబద్ధత ఉందో, ఆ కమిటీ సభ్యుడైన జీ.ఎన్.రావుకి ఎలాంటి అనుభవముందో, ఆయన ఏఏ ప్రాంతాల్లో తిరిగి ఎవరిని ప్రశ్నించి అభిప్రాయాలు సేకరించారో తెలియదన్నారు.
జీఎన్.రావు కమిటీకి ప్రభుత్వం ఎంతిచ్చిందో తెలియదు గానీ సభ్యత, సంస్కారాలు, అవగాహన లేకుండా నివేదిక ఇవ్వడం ద్వారా ఐదున్నర కోట్లమంది ప్రజల్లో చిచ్చురేపాడన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటించిందని, ప్రజలు, మేథావులు, అధికారులు, ఎన్జీవోలు, ఇతరవర్గాల నుంచి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించిందన్నారు.
మరోవైపు బోస్టన్ గ్రూప్‌ని తెరపైకి తీసుకొచ్చారని రాష్ట్రాల అభివృద్ధి, రాజధానుల తరలింపుపై ఆగ్రూప్‌కి ఉన్న అనుభవమేమిటో తెలియదని రామయ్య స్పష్టం చేశారు. బోస్టన్ గ్రూప్‌తో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని... ఈ విషయం చివరివరకు తెలియక మంత్రి బొత్స కూడా నోరెళ్లబెట్టాడని వర్ల తెలిపారు. పోర్చుగల్ పోలీసులు రైడ్‌చేసిన, ఎఫ్‌బీఐ నిఘాలో ఉన్న, 100మిలియన్ పౌండ్ల అవినీతికి పాల్పడిన పనికిమాలిన గ్రూప్‌కి రాష్ట్రప్రజల భవిష్యత్‌ను అప్పగించడం ద్వారా జగన్మోహన్‌రెడ్డి ప్రజల జీవితాలతో చెలగాటమాడాడన్నారు. ఆయనకు ప్రజలు అధికారమిచ్చింది ఇందుకేనా అని వర్ల ప్రశ్నించారు.
read more జగన్ ఆ విషయంలో కూచీపూడి డ్యాన్సర్లనే మించిపోయాడు: నిమ్మల రామానాయుడు
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ డైరెక్టర్ భట్టాచార్య, రోహిత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడని, రోహిత్‌రెడ్డి విజయసాయిరెడ్డికి అల్లుడని రామయ్య స్పష్టం చేశారు. ఏ2కి సాయం చేయడం కోసం ఏ1 ఈ గ్రూప్‌ని తెరపైకి తీసుకొచ్చాడని, రోహిత్‌రెడ్డికి చెందిన అరబిందో ఫార్మా కంపెనీ భూముల్లోనే (విశాఖపట్టణం) రాజధాని రాబోతుందని జీ.ఎన్.రావు చెప్పిందే బోస్టన్‌గ్రూప్ నివేదికలో కూడాఉందన్నారు.
రాజధాని ఈశాన్యంలో ఉంటే జగన్ జైలుకెళ్లడా...?
రాజధాని ఈశాన్యంలో ఉంటే జైలుకెళ్లకుండా ఉంటాడని ఎవరో స్వామీజీ జగన్‌కు చెప్పాడని... జన్మత: క్రైస్తవుడైన జగన్ జాతకం మారుతుందని హిందువైన స్వామీజీ ఎలా చెప్పాడో, ఆయన దాన్నెలా నమ్ముతున్నాడో తెలియడంలేదని వర్ల ఆశ్చర్యపోయారు. ధర్మప్రబోధకులైన స్వామీజీలు జైలుపక్షులను ఎలా సమర్థిస్తారన్నారు. సదరు స్వామీజీ తానేం చెప్పాడో.. జగన్‌కు ఎలా అర్థమైందో, ప్రజాగ్రహం చవిచూడకముందే ఆయనే వివరణ ఇవ్వాలన్నారు.
11కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తుల్ని ఆలింగనం చేసుకున్నప్పుడే సదరు స్వామీజీ ప్రజల్లో గౌరవం కోల్పోయాడన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేగిన రాజధాని మంటలను ఆర్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఉందని... ఇప్పుడు చిన్నమంటలా ఉన్నప్పటికీ అదే భవిష్యత్‌లో రాష్ట్రాన్ని దహించి వేస్తుందనే విషయం గ్రహించాలని వర్ల సూచించారు.
Video: రైతుల గోడు కరకట్ట కమల్‌హాసన్ కనిపించడం లేదా...: లోకేశ్ సెటైర్లు
జగన్‌కు నెపోలియన్.. హిట్లర్‌లు ఆదర్శమా..?
జగన్‌కు ఎవరు ఆదర్శమో తెలియడం లేదన్న వర్ల ఆయన విధానాలు, నిర్ణయాలు, పాలన చూస్తుంటే తనకు నెపోలియన్ బోనోపార్టీ, హిట్లర్‌లు గుర్తుకువస్తున్నారని రామయ్య చెప్పారు. జగన్ పాలన చూస్తుంటే ''ప్రజలు అభివృద్ధిపై ప్రశ్నిస్తే వాళ్ల ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టండి'' అన్న నెపోలియన్ బోనోపార్టీ వ్యాఖ్యలు, ''ప్రజా ఉద్యమాలు అణచాలంటే అంతర్గత చీలికలు, ప్రలోభాలు, పాదాక్రాంతం తప్పదుకదా '' అన్న హిట్లర్ వ్యాఖ్యలు గుర్తొస్తున్నాయని రామయ్య పేర్కొన్నారు.
నెపోలియన్, హిట్లర్‌లు పెద్ద సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారని, కానీ వారి అహంకారం, నియంతృత్వ విధానాలతో కాలగర్భంలో కలిసిపోయారనే విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు. తనకు నెపోలియన్, హిట్లర్‌లే ఆదర్శమని జగనంటే, ఎవరేం మాట్లాడలేరన్నా రు. హిట్లర్ చెప్పినట్లుగా రాజధాని అనే ప్రజా ఉద్యమాన్ని అణచడానికి కూడా జగన్ సామ,దాన, బేధ, దండోపాయాలను ఉపయోగిస్తున్నాడన్నారు.
రాజధాని విశాఖ కు తరలిస్తే, రాయలసీమ వాసుల పరిస్థితి ఏంటని వర్ల ప్రశ్నించారు. చంద్రబాబుకి పేరొస్తుందని అమరావతిని నిలిపివేశాడంటున్న జగన్, శిలాఫలకాలపై ఉన్న చంద్రబాబు పేరుని తీసేసి, తనపేరుని వేసుకొని అయినా రాజధానిని కొనసాగిస్తే మంచిదని వర్ల అభిప్రాయపడ్డారు.
జనం మధ్యన 'జగన్ షరీఫ్'.....
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై రైతులముసుగులో దాడి జరిగిందని, చంద్రబాబే... తనపార్టీవారితో ఆ దాడిచేయించారని వైసీపీనేతలు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. పిన్నెల్లిపై జరిగిన దాడిని స్టేజ్‌మేనేజ్డ్ డ్రామాగా అభివర్ణించిన రామయ్య రాష్ట్రమంత్రి, మరోనేత వాహనాలను పక్కనుంచి పంపిన పోలీసులు పిన్నెల్లి వాహనాన్ని మాత్రం రైతులమధ్యకు పంపడం పలు సందేహాలకు తావిస్తోందన్నారు.
పిన్నెల్లి అక్కడకు వెళ్లాలి... దాడి జరగాలి... తరువాత ముఖ్యనేతలను అరెస్ట్‌చేసి ఉద్యమాన్ని అణచివేయాలన్న ఉద్దేశంతో హిట్లర్ చెప్పినట్లుగానే రాష్ట్రప్రభుత్వం నడుచుకుందన్నారు. రాజ్యాంగంలో నిరసనతెలిపే హక్కు అందరికీ ఉందన్న డీజీపీ ముఖ్యమంత్రి, రైతులకు కూడా ఆ హక్కులు ఉంటాయని ఎందుకు తెలుసుకోవడంలేదన్నారు.
పులివెందుల వ్యక్తికి రైతుల ఆందోళనలో ఏం పనని, జగన్‌కు అనుంగు అనుచరుడైన వైసీపీ యువత విభాగంలో కీలకమైన జగన్ షరీఫ్ అనే వ్యక్తి చినకాకాని ఎందుకొచ్చాడో, రైతులమధ్యకు చేరి పిన్నెల్లి వాహనాన్ని ఎందుకు అడ్డుకున్నాడో, ఎందుకు రాళ్లు రువ్వాడో జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. పులివెందుల నుంచి వచ్చిన వ్యక్తి అక్కడికెలా వచ్చాడో.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడికి అతడే మూల సూత్రధారని రామయ్య తేల్చిచెప్పా రు.
జగన్ షరీఫ్ ఎవరు.. అతని పూర్తి వివరాలేమిటో.. అతను పిన్నెల్లి వాహనాన్ని ఎందుకు అడ్డగించాడో.. పూర్తి వివరాలు రాబట్టాల్సిన బాధ్యత రాష్ట్ర హోంమత్రిపైనే ఉందన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి వ్యాఖ్యలున్నాయన్నారు. తనపార్టీ నేతలైన కొడాలినాని, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రోజా, మల్లాది విష్ణు, ధర్మాన కృష్ణదాస్‌ల బూతుపురాణం విన్నాక అంబటి ఇతరులకు నీతివాక్యాలు చెప్పాలన్నారు.
మంత్రిగా ఉండి లుచ్చా గాడు.. సన్నాసిగాడు అంటూ కొడాలి వాడిన బూతుపురాణం, విలేకరులను దూషిస్తూ అరేయ్.. ఒరేయ్.. కొడకా, చెప్పరా గాండూ అంటూ, కోటంరెడ్డి వల్లించిన బూతులు, రోజా, టీడీపీ మహిళానేతను ఉద్దేశించి మల్లాదివిష్ణు వాడిన అసభ్యపదజాలం అంబటి చెవికెక్కలేదా..లేక వినపడనట్లుగా నటిస్తున్నారా అని వర్ల నిలదీశారు. సభ్యత , సంస్కారం ఎవరికున్నాయో, ఎవరికి లేవో ఇప్పటికైనా రాంబాబు తెలుసుకోవాలన్నారు.