జగన్ పెద్ద నీతిమండేమీ కాదని బొత్స ఆనాడే అన్నాడు... సాక్ష్యమిదే...: వర్ల రామయ్య

మంత్రి బొత్స సత్యనారాయణపై టిడిపి సీనియర్ నాయకులు వర్ల రామయ్య విరుచుకుపడ్డారు. గతంలో వైఎస్ జగన్ గురించి ఆయన చేసిన విమర్శలను గుర్తుచేస్తూ సెటైర్లు విసిరారు. 

Varla Ramaiah Satires On  Minister Botsa Satyanarayana

గుంటూరు: మంత్రి బొత్స సత్యనారాయణ చిత్రవిచిత్రంగా మాట్లాడుతుంటారని... తన మాటలకు తానే వింతభాష్యాలు చెప్పడం కూడా ఆయనకు ఒక అలవాటని, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తేనే ఆయన దేనయినా నమ్ముతాడని  టీడీపీ సీనియర్‌నేత, ఆ  పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. నిన్నటికి నిన్న బొత్స ఎన్డీఏలో చేరడంపై మాట్లాడుతూ అవసరమైతే ఎవరికాళ్లు, గడ్డాలైనా పట్టుకుంటామన్నారని...దాన్ని కాదంటూ నేడు ఒక పత్రికాసంస్థ యజమానికి నోటీసులివ్వడం సిగ్గుచేటని వర్ల స్పష్టంచేశారు. 

మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో శనివారం వర్లరామయ్య విలేకరులతో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్రం కోసం కాళ్లు, గడ్డాలు పట్టుకుంటామన్న మంత్రి ఎన్డీఏలో చేరుతామని చాలా స్పష్టంగా చెప్పాడన్నారు. మాటనడం, వెనక్కు పోవడం బొత్సకు ఎప్పటినుంచో ఉన్న అలవాటేనన్నారు. 

మైనారిటీలు తమ ప్రభుత్వాన్ని ఛీకొడతారన్న భయంతో, ముస్లింలను మభ్యపెట్టడంకోసం బొత్స, వైసీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గాయన్నారు. 21-08-2011న ఒక సందర్భంలో బొత్స మాట్లాడుతూ... ''పేపర్‌, ఛానల్‌ ఉన్నంతమాత్రాన జగన్మోహన్‌రెడ్డి, నీతిమంతుడు అవుతాడా'' అన్నది నిజంకాదా అని వర్ల ప్రశ్నించారు. 

read more  రాజధాని కోసం ఖర్చుచేసింది రూ.117 కోట్లే... ఆ రెండు వేల కోట్లు...: మంత్రి బుగ్గన

అవినీతి పార్టీని వదిలిపెట్టనని గతంలో చెప్పిన బొత్స ఇప్పుడు అదేపార్టీలో ఉంటూ ఇతరులపై బురదజల్లాలని చూస్తున్నాడన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తాగని రోజుందా.. అని, తానే వైఎస్‌ కు బ్రాందీ పోసినట్లుగా మాట్లాడిన బొత్స ఇప్పుడు అదే వైఎస్‌పేరుతో ఉన్న పార్టీలో ఎలా ఉంటున్నాడో చెప్పాలన్నారు.  షర్మిల భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ గురించి కూడా బొత్స నోరుపారేసుకున్నాడన్నారు. 

కోట్లు దోచుకున్న జగన్‌ని జాతిపితతో ఎలా పోలుస్తారంటూ గతంలో మండిపడిన బొత్స ఇప్పుడు అదే జగన్‌ మంత్రివర్గంలో ఎలా కొనసాగుతున్నాడో చెప్పాలని వర్ల డిమాండ్‌ చేశారు. బొత్సకంటే రోజూ బ్రాందీతాగేవారే నయమని... వారు అప్పుడప్పుడైనా మాటపై నిలబడతారని రామయ్య  దెప్పిపొడిచారు. 

ఆంధ్రప్రభ, టైమ్స్‌ఆఫ్‌ ఇండియాలో కూడా బొత్స వార్తవచ్చిందని...  ఆయా పత్రికలకు ఆయనెందుకు బహిరంగ లేఖలు రాయలేదన్నారు. బొత్స నోరుతెరిస్తే అన్నీ అబద్ధాలేనని... ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడుకూడా ఇదేవిధంగా మాట్లాడేవాడన్నా రు. అమరావతి శ్మశానమనే మాటను మంత్రి బొత్స ఆప్రాంత మహిళల ముందుకొచ్చి మాట్లాడితే సంతోషిస్తామన్నారు. 

read more  వైసిపి గెలుపుకు బిజెపియే కారణం... ఎన్డీఏలో చేరికపై ఏమైనా జరగొచ్చు..: ఎంపీ టిజి

బొత్స తన ఆస్తుల వివరాలు ప్రకటించాలని...  రాజకీయాల్లోకి రాకముందు ఆయనకున్న ఆస్తులెన్నో చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు.  తెల్లారేసరికి ఆస్తులు అమాంతం రెట్టింపు ఎలా అవుతాయో, రాజకీయాల్లో డబ్బులు కొట్టేయడం ఎలా అనే అంశాలపై బొత్స ఒక పాఠశాల నడిపితే బాగుంటుందని వర్ల హితవుపలికారు. 
తిన్నింటివాసాలు లెక్కపెట్టేలా బొత్స వైఖరిఉందని, ఆయన బాటలోనే  మంత్రి అనిల్‌కుమార్‌ కూడా నడుస్తున్నాడన్నారు. చంద్రబాబు జైలుకెళతాడంటున్న ఉమ్మారెడ్డి ముందు జైలుకెళితే, ఆయనవెనక ఇతరులు వస్తారనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. వయోవృద్ధుడైన ఉమ్మారెడ్డి కూడా మతిలేకుండా మాట్లాడితే ఎలాగన్నారు వర్ల రామయ్య.        

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios