వైసిపి గెలుపుకు బిజెపియే కారణం... ఎన్డీఏలో చేరికపై ఏమైనా జరగొచ్చు..: ఎంపీ టిజి
కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ కూటమిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరుతుందంటూ ప్రచానం జరుగుుతన్న సమయంలో అందుకు ఊతమిచ్చేలా ఎంపీ టిజి వెంకటేశ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
కర్నూల్: గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీని కాదని ఏపి ప్రజలు వైఎఎస్సార్ కాంగ్రెస్ కు బంపర్ మెజారిటీ అందించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఫలితమే ఈ భారీ విజయానికి కారణమని వైసిపి నాయకులు చెబుతుంటారు. అయితే వైసిపి విజయానికి భారతీయ జనతా పార్టీ కూడా మరో కారణమంటూ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకియల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు వుండరని... ఉభయ పార్టిలకు సమ్మతమైనప్పుడు కలిసే అవకాశం ఉంటుందని తెలిపారు. అలా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో బిజెపి, రాష్ట్రంలో అధికారంలో వున్న వైసిపి లు కలిసే అవకాశాలున్నట్లు మంత్రి బొత్స మాటలను బట్టి తెలుస్తోందన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయంటూ టిజి వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి సహకారించడం వల్లే వైసిపికి ఇంత భారీ విజయం సాధ్యమయ్యిందన్నారు. అయితే వైసిపి గెలుపులో ఇదికూడా ఒక కారణం మాత్రమేనని...ఇదే మొత్తం విజయవానికి కారణం కాదన్నారు.
read more కర్నూల్ అభివృద్ది కోసం కదిలిన ఎన్నారైలు... స్థానిక ఎంపీతో సమావేశం
ముఖ్యమంత్రి జగన్ నుండి సంకేతాలు వచ్చి వుంటేనే మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్డీఏలో వైసిపి కలిసే అవకాశాలున్నట్లు వ్యాఖ్యానించి వుంటారని అన్నారు. బీజేపీ, వైసీపీ ల కలయిక అన్నది పైస్థాయిలో చర్చించి లాభ నష్టాలను నిర్ణయిస్తారన్నారు. అయితే ఏదో విధంగా వైసిపికి బిజెపి మద్దతు ఉంటుందన్నారు. ఇరు పార్టీల కలయికపై ఏమైనా జరగచ్చంటూ ఎంపీ టిజి వెంకటేశ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.