కర్నూల్: అవినీతి సంపాదన కోసమే చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అంటూ హడావిడి చేశాడని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఆయన అవినీతి డొంక కదులుతోందని అన్నారు. బాబు అవినీతి ఫలితంగానే అతని పిఏ ఇంట్లో రెండు వేల కోట్ల అక్రమ సొత్తు  బయటపడిందన్నారు.

''శ్రీనివాస్ తో పాటు కిలారు రాజేష్ పైన ఐటి దాడులు జరిగాయి. రాజేష్ టిడిపి ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పని చేశారు. కడప జిల్లా టిడిపి ప్రెసిడెంట్ ఆర్కె కి చెందిన ఇన్ ఫ్రా కంపెనీల్లో కూడా ఐటి సోదాలు జరిగాయి. నీతులు చెప్పే టిడిపి వాళ్లు ఐటి దాడులు సంబందం లేదంటున్నారు. మరి ఎవరికి సంబందం ఉందో టిడిపి వాళ్లే చెప్పాలి'' అని నిలదీశారు.

''సిఆర్డిఏ పరిధిలో లక్ష కోట్ల పనులు చేస్తామని చెప్పి రోడ్లు కూడా సరిగ్గా వేయలేదు. టిడిపి చెప్పినట్లు లక్షల కోట్ల నగరాన్ని కట్టలేము. 117 కోట్లు మాత్రమే రాజధాని కోసం రాష్ట్ర ఖజానా నిధులు ఖర్చు చేశారు. మిగతాదంతా బోగస్ కంపెనీలు పేరుతో అప్పులు తెచ్చి ఖర్చు చేశారు. జనం నెత్తిన అప్పులు పెట్టి బాహుబలిలో మహిస్మతి భవనం మాదిరిగా భవనం కడతారంట.'' అని ఎద్దేవా చేశారు. 

read more  ''అవసరమైతే ఎన్డీయేలో చేరతాం'' ఇది హెడ్డింగా...ఇంత దిగజారతారా..?: రామోజీరావుకు బొత్స లేఖ

''అనంతపురం జిల్లా వాసులు అమరావతిలో ముందుగానే భూములు కొన్నారు. నాలుగు వేల ఎకరాలు టిడిపి వాళ్లు అమరావతిలో రాజధాని  ఏర్పడకముందే భూములు కొనుగోళ్లు చేశారు'' అంటూ మరోసారి అమరావతిలో భూఅక్రమాల గురించి బుగ్గన ప్రస్తావించారు. '

'ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు అంటూ కొత్త కంపెనీలు పెట్టి తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ డబ్బులు డ్రా చేశారు.  రేణిగుంట దగ్గర ఇష్టారాజ్యంగా తక్కువ ధరకే భూములు కేటాయించారు. ఇళ్ల పేరుతో అదనంగా డబ్బులు చార్జ్ చేశారు.'' అంటూ గతంలో టిడిపి హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెట్టారు. 

ఇక కర్నూల్ జిల్లాలో అక్రమాలు చేస్తాం సన్మానం చేయండి అన్నన్నట్టు కేఈ కుటుంబం వ్యవహరిస్తోందన్నారు. నకిలీ మద్యం కేసులో వాస్తవాల ఆధారంగానే పోలీసులు వ్యవహరించారని...  డోన్ టీడీపి ఇంచార్జ్ కెఈ ప్రతాప్ ఇంట్లో 23 క్యాన్ల నకిలీ మద్యం దొరికింది వాస్తవమే కదా..? అని ప్రశ్నించారు. అవినీతి పరులు, అక్రమార్కులు పట్టుబడక తప్పదన్నారు. 

read more  మేం గుజరాత్ తో పోటీపడ్డాం... అందువల్లే...: చంద్రబాబు నాయుడు

లిక్కర్ సప్లై హుబ్లీ నుంచి జరిగినట్లు విచారణలో తేలిందని... నకిలీ మద్యం సిండికేట్ ప్రధాన సూత్రధారి వినోద్ కల్లాల్ కూడా కేఈ ప్రతాప్ పేరు చెప్పారని అన్నారు. పోలీసు అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి చేయడం అన్నది అవాస్తవమన్నారు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒక గెస్ట్ రోల్ ప్లే చేస్తూ విసిటింగ్ ప్రొఫెసర్ గా మారాడన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బుగ్గన.