జగన్ కు అంత సీన్ లేదు... కేవలం ఆ ఒక్కడి వల్లే వైసిపి గెలుపు: మాజీ మంత్రి వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అతడి మొఖం చూసి ప్రజలు ఓటెయ్యలేదన్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖం చూసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వర రావు పేర్కొన్నారు. జగన్ ను చూసి ఏ ఒక్కరు ఓటు వేయలేదని... ఆయన గత చరిత్రంతా ప్రజలు ఓటేసే స్థాయిది కాదంటూ మాజీ మంత్రి మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారుల వ్యవహార శైలి రాజ్యాంగ బద్ధంగా లేవని హై కోర్ట్ వ్యాఖ్యానించిందని గుర్తుచేశారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. రాజధాని రైతుల భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంకోసం ఇచ్చిన జీవో సీఆర్డీఏ చట్టానికి వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.
read more విజయమ్మను కూడా అలా చేస్తే జగన్ కు తెలిసేది...: అనురాధ ఘాటు విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత వ్యవహారంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఏకంగా డిజిపి కోర్టుకు వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చిందన్నారు. సార్వత్రిక ఎన్నికలు అయిన వెంటనే ఎవరు చెప్పినా వినకుండా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేశారని... స్థానికఎన్నికల నేపథ్యంలో కోర్ట్ చెప్పినా ఇప్పటివరకు రంగులు మార్చకపోవడానికి గల కారణమేంటని ప్రశ్నించారు.
''నేను ఉన్నాను, చేస్తాను అవ్వా తాత'' అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ కు రైతుల ఆక్రందనలు కనబటడం లేదా? అని నిలదీశారు. అక్రమ పాలనకు కళ్లెం వేయడానికి కోర్టులు ఉన్నాయని... రాజ్యాంగబద్ధంగా పని చేయకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రజలు సిగ్గు పడుతున్నారని... ఎన్నికల కమీషనర్, డిజిపి లాంటి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని అన్నారు. రూల్ ఆఫ్ లా పాటిస్తామని చెప్పి 24 గంటలు గడవకముందే వైసిపి రౌడీలు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని అన్నారు. పోలీస్ అంటే ఏమాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. నామినేషన్ దాచుకున్న మహిళపై దాడి చేశారని... వారిపై ఎం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని, ఈసిని ప్రశ్నించారు.
read more సీఎం జగన్ సొంతజిల్లాలోనే అక్రమాలు... ఎన్నికల కమీషన్ పై హైకోర్టు ఆగ్రహం
రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన అమలు చేసే అధికారం కేంద్రానికి ఉందన్నారు. విశాఖకు రాజధాని తరలించాలని విజయసాయి సలహా ఇస్తేనే జగన్ ఇదంతా చేస్తున్నాడన్నారు. అమరావతినే రాజధానిగా కొనసాగుతుందని ప్రకటించాలని సూచించారు. ముమ్మాటికీ అమరావతే రాజధాని అని...మూడు రాజధానులు చట్ట విరుద్ధమని శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు.