నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో క్రైమ్ రేటు పెరిగిపోతోంది. హత్యలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లు, కిడ్నాప్‌లతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నవులూరులో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.

స్థానిక పుట్టరోడ్‌లోని ఎస్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఇంట్లో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తితో విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేసి అనంతరం బైకుపై పరారయ్యాడని పోలీసులు తెలిపారు.

మృతుడిని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన మురుగేశ్‌గా గుర్తించారు. ఇతను ఏడాది క్రితం పుట్టరోడ్‌లోని ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ వెంకట్రావు ఇంటి మేడపై ఉన్న పెంట్‌హౌస్‌లో దిగాడు.

Also Read:వివాహేతర సంబంధం.. ప్రియుడిపై పెట్రోల్ పోసి...

పట్టణంలోని ఆటోనగర్‌లో గల అన్నామలై బస్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకుని మరో వ్యక్తితో కలిసి బైకుపై ఇంటికి చేరుకున్నాడు.

ఈ క్రమంలో ఇంటి యజమాని కుమారుడు తరుణ్ ఆదివారం ఉదయం వ్యాయామం చేసుకునేందుకు అతనికి పైకి వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతనికి ఎదురుపడి హడావుడిగా కిందకి దిగి మురేగేశ్‌ బైక్‌పై వెళ్లిపోయాడు.

దీంతో అనుమానం వచ్చిన తరుణ్ పెంట్‌హౌస్‌ తలుపులు తీసి చూడగా మురుగేశ్ రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో తరుణ్ భయంతో కేకలు వేశాడు. కేకలు విన్న తండ్రి వెంకట్రావు పైకి వెళ్లేసరికి మురుగేశ్ మరణించాడు.

Also read:పరాయి మహిళతో భర్త వివాహేతర సంబంధం: పెళ్లి చేసిన భార్య

అతని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మంగళగిరి రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనంతరం క్లూస్‌టీమ్, డాగ్ స్వాడ్ సాయంతో ఆధారాలను సేకరించారు. అయితే మురుగేశ్ హత్యకు స్వలింగ సంపర్కమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మురుగేశ్ రాత్రివేళ తరచూ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులను తీసుకువస్తుంటాడని స్థానికులు తెలిపారు. ఇటీవల పెంట్‌హౌస్ బయట కండోమ్ ప్యాకెట్లు పడివుండటాన్ని చూసి ఇంటి యజమానికి అనుమానం వచ్చి అతనిని మందలించినట్లుగా తెలుస్తోంది. ఈ కారణాలతో పాటు వివాహేతర సంబంధం నేపథ్యంలోనూ ఈ హత్య జరిగి వుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.