Asianet News TeluguAsianet News Telugu

వివాహేతర సంబంధం.. ప్రియుడిపై పెట్రోల్ పోసి...

ఆషాకు అంతకు ముందే ధర్మలింగం అనే వ్యక్తితో వివాహమై ఇద్దరు పిల్ల్లలు ఉన్నారు. భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆషా.. వెంకటేష్ తో సంబంధం పెట్టుకుంది.  ఈ విషయం జయకు తెలియడంతో భర్తను నిలదీసింది. 

woman petrol attack on lover in tamilnadu
Author
Hyderabad, First Published Nov 25, 2019, 10:16 AM IST

అతనికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యను కాదని మరో వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ ప్రియురాలితో సంసారం చేస్తూ.. మరో మహిళను లైన్లో పెట్టాడు. ఈ విషయం కాస్త మొదటి ప్రియురాలికి తెలిసిపోయింది. ఇంకేముంది వెంటనే పెట్రోల్ తో దాడి చేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుముల్ లైవాయిల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆవడి స్పెషల్ పోలీసు బెటాలియన్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న వెంకటేష్(31) సత్యమూర్తి నగర్ లోని పోలీస్ క్వార్టర్స్ లో నివసిస్తున్నాడు. అతని స్వస్థలం విల్లుపురం. కాగా... అతనికి 2012లో జయ అనే యువతితో వివాహమైంది. వీరి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. కాగా.... కొంత కాలం క్రితం పులియాంతోపు ప్రాంతానికి చెందిన ఆషా(32) తో వెంకటేష్ కి పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆషాకు అంతకు ముందే ధర్మలింగం అనే వ్యక్తితో వివాహమై ఇద్దరు పిల్ల్లలు ఉన్నారు. భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆషా.. వెంకటేష్ తో సంబంధం పెట్టుకుంది.  ఈ విషయం జయకు తెలియడంతో భర్తను నిలదీసింది. అతడిలో మార్పు రాకపోవడంతో 2015లో కుమారుడితో కలిసి పుట్టింటికి వెళ్లింది. కుమార్తె తండ్రితోనే ఉండిపోయింది. అనంతరం వెంకటేశ్‌ తన ప్రియురాలు ఆషాను క్వార్టర్స్‌కు తీసుకొచ్చాడు.

ఈ క్రమంలో వెంకటేశ్‌కు ఓ మహిళా పోలీసుతో సంబంధం ఉన్న విషయం ఆషాకు తెలిసింది. దీంతో ఆగ్రహించిన ఆమె శనివారం వెంకటేశ్‌ను నిలదీసింది. వెంకటేష్‌ మద్యం మత్తులో ఉండడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆషా అక్కడున్న పెట్రోలును వెంకటేశ్‌పై కుమ్మరించింది. దీంతో అతను బయటకి పరుగుతీస్తుండగా అగ్గిపుల్ల వెలిగించి అతనిపై వేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని కీల్పాక్కం ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తిరుముల్‌లైవాయిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పురుషోత్తమన్‌ కేసు నమోదు చేసి ఆషాను విచారిస్తున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios