గుంటూరు: శాసనమండలి సభ్యులను దద్దమ్మలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఆమె సంస్కారం ఎలాంటిదో తెలియజేస్తుందని టిడిపి ఎమ్మెల్సీ సంధ్యారాణి ఆరోపించారు. ఈ వ్యాఖ్యల గురించి ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదని... ఈ విషయాన్ని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. 

అయితే పెద్దల సభలో అందరూ దద్దమ్మలే వున్నారన్న రోజా అదే మండలి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు వున్నారన్న విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. అంటూ జగన్ మంత్రివర్గంలో దద్దమ్మలు వున్నారన్న విషయాన్ని రోజా ఒప్పుకుంటున్నారా...? అని సంధ్యారాణి ప్రశ్నించారు. 

read more బాలకృష్ణ కనుసైగ చేసి, చంద్రబాబుని తరిమికొడతారు... ఎమ్మెల్యే రోజా

మంగళవారం ఆమె మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలి సభ్యులు వైసీపీ ప్రభుత్వానికి తాళం కొట్టడంలేదనే సభను రద్దు చేయడం జరిగిందన్నారు. రాజధానిని మూడుముక్కలు చేయడాన్ని వ్యతిరేకించామని... తెలుగు బోధనను అమలుచేయాలని సూచించామనే రాష్ట్ర ప్రభుత్వం మండలిపై కక్షపెంచుకుందన్నారు. 

సంస్కారం లేకుండా మాట్లాడేవారి గురించి తాము సంస్కారహీనంగా మాట్లాడలేమని, జబర్దస్త్ వేషాలను జనం ఆదరించరనే విషయాన్ని రోజా తెలుసుకోవాలన్నారు. మహిళల ఆందోళనలను సాటి మహిళగా ఉండి హేళనచేయడం, ఎమ్మెల్యేగా ఉండి సాటి ఎమ్మెల్యేలను కించపరచడం, ప్రజలపక్షాన నిలిచి వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న వారిని తులనాడటం మంచిపద్ధతి కాదని రోజాను  హెచ్చరించారు. 

read more  అందుకోసమైతే చంద్రబాబు దేనికైనా సిద్దం...లేకపోతే మాత్రం..: మంత్రి అవంతి

విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సంధ్యా రాణి మాట్లాడుతూ... రోజా మాట్లాడే విషయాలను పట్టించుకుంటూ పోతే రోజూ ఫిర్యాదు చేయాల్సి ఉంటుందన్నారు. మగ పోలీసులు తిడుతున్నా, కొడుతున్నా ఓర్చుకుంటూ, రాజధాని మహిళలు చేస్తున్న పోరాటం, వారి మాటతీరు చూసైనా రోజా తన పద్ధతి మార్చుకోవాలని సంధ్యారాణి సూచించారు.