గుంటూరు: రాష్ట్రాన్ని పాలించాల్సిన ప్రభువే కనికరం లేకుండా రైతులను పోలీసులతో తన్నిస్తున్నారని టిడిపి నాయకులు,ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సీఎం జగన్మోహన్  రెడ్డిపై ఫైర్ అయ్యారు. అన్నదాతలకు అన్యాయం చేస్తూ రాక్షసానందం పొందుతున్న ఈ  పాపం ఊరికేపోదని... ఇంతకింతకు అనుభవిస్తాడని అన్నారు.  

రాజధానికి కోసం మొదట నిపుణుల కమిటీ ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదిక అన్నారని ఇప్పుడేమో హైపవర్ కమిటీ అని ప్రభుత్వం నాటకాలాడుతోందని వెంకన్న ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు, రైతులను తప్పుదారి పట్టించే తతంగానికి జగన్‌ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ప్రకారమే జరుగుతోందని... హైపవర్‌ కమిటీ నివేదిక కూడా ఇలాగే ఉంటుందన్నారు. 

రూ.43వేల కోట్లు దోచేసిన వారు నీతి, నిజాయితీ అనడం సిగ్గుచేటన్నారు.  విజయసాయికి చిత్తశుద్ధి ఉంటే భరత్‌ భూములపై చర్చకు రావాలన్నారు. రాజధాని ప్రాంత రైతులకు నిద్రాహారాలు లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే అని అన్నారు. 

read  more  ఎట్టి పరిస్థితుల్లో అది జరిగితీరాలి: అధికారులకు సీఎం ఆదేశం

రైతులను పెయిడ్‌ ఆర్టిస్ట్ లంటూ హేళనగా మాట్లాడటం జగన్‌ విపరీత మనస్తత్వానికి నిదర్శనమన్నారు. దేశంలో రైతులు కంటతడిపెట్టిన రాష్ట్రంగా ఏపీ నిలిచిపోతుందన్నారు.  ఏపీ పరిస్థితి పిచ్చోడిచేతిలో రాయిలా తయారైందని వెంకన్న ఫైర్ అయ్యారు.  

''విశాఖలోనే రాజధాని అని విజయసాయి రెడ్డి గారు హై పవర్ తో బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఇక రాజధాని పై హై పవర్ కమిటీ ఎందుకు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు నివేదిక ఎందుకు వైఎస్ జగన్ గారు. అంతా డ్రామా అని ప్రజలకు అర్ధం అయ్యిపోయింది.'' అని ఎద్దేవా చేశారు. 

read more  జర్నలిస్టుల కంటే కాకులే నయం... క్రూర జంతువు మాదిరిగా: పేర్ని నాని

''అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాలు అన్ని టీడీపీ ఫండింగ్ తో జరుగుతున్నాయి. వారంతా పెయిడ్ ఆర్టిస్టులు అని విజయసాయి రెడ్డి పదే పదే అవమానిస్తున్నా సిగ్గు లేని కృష్ణా, గుంటూరు వైకాపా నాయకులు నోరు మూసుకొని కూర్చున్నారు.

ఈ ప్రాంత ప్రయోజనాలు కాపాడలేని వారు, రైతులను, ప్రజలను అవమాన పరుస్తున్నా నోరు విప్పి మాట్లాడలేని వైకాపా నేతలు వెంటనే రాజీనామా చెయ్యాలి'' అని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.