వైసిపి మైండ్ గేమ్... పావులుగా మారుతున్న టిడిపి ఎమ్మెల్యేలు: నిమ్మల రామానాయుడు

శివరామకృష్ణన్‌ కమిటీ 13జిల్లాలు తిరిగి అమరావతిని రాజధానిగా ఎంపికచేస్తే జీఎన్‌.రావు కమిటీ ఏసి గదుల్లో కూర్చుని  విశాఖను రాజధాని చేయాలనే అసంబద్ద నివేధికను ప్రభుత్వానికి సమర్పించిందని టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. 

TDP MLA Nimmala Ramanaidu reacts  on Maddala Giri joined in YSRCP

గుంటూరు: ప్రజల్ని గందరగోళానికి గురిచేయడానికే జగన్‌ ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు ఆరోపించారు.  రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని నిర్ణయించి ఆ ప్రాంతం నుంచి ఐదేళ్లపాటు పాలన కొనసాగాక ఇప్పుడు రాజధాని మార్పంటూ రోజుకోకమిటీ ఎలా వేస్తారని ఆయన వైసిపి ప్రభుత్వాన్ని నిలదీశారు. 

సోమవారం ఆయన ఎమ్మెల్సీ అశోక్‌బాబుతో కలిసి ఆత్మకూరులోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... శివరామకృష్ణన్‌ కమిటీ 13జిల్లాలు తిరిగి అమరావతిని రాజధానిగా ఎంపికచేస్తే ఇప్పుడు జీఎన్‌.రావు కమిటీ వేయడానికి ప్రభుత్వానికి ఏం అధికారముందన్నారు. అసలు జీఎన్‌.రావు కమిటీ నివేదిక రాకుండానే సీఎం దాని గురించి అసెంబ్లీలో మాట్లాడటం, రాజధాని విశాఖలో రాబోతుందంటూ రాజ్యాంగేతరశక్తిగా విజయసాయి మాట్లాడటం దేనికి సంకేతమని నిమ్మల ప్రశ్నించారు. 

బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ)ని ఎప్పుడు నియమించారు... ఏవిధమైన నివేదిక ఇవ్వాలని నిర్దేశించారో ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. బీసీజీ ఏ శాఖ పరిధిలో పనిచేస్తోందని... దానికి ఉన్న నియమ నిబంధనలు, పరిధి ఏమిటని, ఏ జీవో ప్రకారం ఆ గ్రూప్‌ని నియమించారో వెల్లడించాలన్నారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా బోస్టన్‌ గ్రూప్‌ని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. 

సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో, పోర్చుగల్‌లో పనిచేసినప్పుడు బోస్టన్‌ గ్రూప్‌పై అనేక వివాదాలున్నాయని... అలాంటి సంస్థను రాజధానిపై నివేదిక ఇవ్వమని ఎవరు ఆదేశించారో, ఎవరి ఒత్తిడితో ఈ పనిచేశారో ప్రజలకు చెప్పాలన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడైన రోహిత్‌రెడ్డికి బీసీజీ సంస్థ డైరెక్టర్‌ భట్టాచార్య మంచి మిత్రుడని, విజయసాయి ప్రోద్భలంతోనే రాజధాని అంశాన్ని ఆ సంస్థకు అప్పగించారని టీడీపీ ఎమ్మెల్యే తేల్చిచెప్పారు. 

read more  ఎన్‌ఆర్సీ, ఎన్‌పీఆర్‌లపై టీడీపీ వైఖరి ఇదే: చంద్రబాబు ప్రకటన

అవినీతిరహిత దేశమైన సింగపూర్‌కి చెందిన కన్సార్టియం జోక్యాన్ని ప్రతిపక్షంలో ఉండి తప్పుపట్టిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఒక దళారీ సంస్థైన బీసీజీకి రాజధాని అధ్యయన బాధ్యతలు అప్పగించారని, దానికి కొనసాగింపుగా హైపవర్‌ కమిటీ అనడం దారుణమన్నారు. ఏడు నెలల్లో ఉవ్వెత్తున వస్తున్న ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రాష్ట్ర ప్రభుత్వం కమిటీలతో కాలయాపన చేస్తోందన్నారు.

మైండ్‌గేమ్‌లో భాగంగానే ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలకు వల....

జగన్మోహన్‌రెడ్డి మైండ్‌గేమ్‌లో భాగంగానే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడన్నారు. ఇసుకకొరతపై, భవననిర్మాణ కార్మికుల మరణాలపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం ఆందోళన చేస్తున్నవేళ గన్నవరం ఎమ్మెల్యే వంశీని ప్రలోభపెట్టారని... ఇప్పుడు రాజధాని ఆందోళనలపై టీడీపీచేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి మద్దాలి గిరిని లొంగ దీసుకున్నారని నిమ్మల స్పష్టంచేశారు. 

read more  హరీశ్‌రావు, కేటీఆర్‌ వ్యాఖ్యలే జగన్‌ పనితీరుకు నిదర్శనం: బోండా ఉమ

నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉంటానని, ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని, అలాంటి రాజకీయాలకు పాల్పడనని అసెంబ్లీలో చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఆ విషయంలో కూడా మాటతప్పాడని అన్నారు. స్పీకర్‌ని అడ్డుపెట్టుకొని అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు విడిగా సీట్లు ఇప్పిస్తున్నాడని నిమ్మల మండిపడ్డారు. 
151 మంది గెలిచారన్న అహంకారం జగన్‌లో రోజురోజుకీ తగ్గుతోందని, 23మంది సభ్యులున్న టీడీపీకి సమాధానం చెప్పుకోలేకే జగన్‌ ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నాడని నిమ్మల ఎద్దేవాచేశారు.   

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios