అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సభ్యులందరూ రాజ్యాంగం మీద చేసిన ప్రమాణాన్ని విస్మరించి సభ్యసమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మహిళలందరూ తలదించుకునేలా బూతుల పంచాంగం విప్పుతున్నారని,  ఈ మంత్రులు మనుషులేనా అన్న అనుమానం కలిగేలా వారి మాటలున్నాయని అన్నారు.

కొడాలినాని బూతులగురించి చెప్పాలంటే పెద్ద గ్రంథమవుతుందని, మంత్రుల బూతులు జగన్‌ దృష్టికి వెళ్తున్నాయా అని అన్నారు. రాష్ట్రంలో ఇంటిలిజెన్స్‌ వ్యవస్థనేది ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు.   

చంద్రబాబునాయుడు వంటి వ్యక్తిని పట్టుకొని వాడు, వీడు, నీచుడు అని సంబోధించడం బూతుల మంత్రికే చెల్లిందన్నారు. ఉచ్చనీచాలు, చదువు, సంస్కారం లేనివ్యక్తి తన కేబినెట్లో మంత్రిగా ఉంటే జగన్‌ ఏంచేస్తున్నాడన్నారు. కేబినెట్‌కి నాయకత్వం వహించే ముఖ్యమం త్రి, తన మంత్రులను కట్టడిచేయడంలో విఫలమయ్యాడని రామయ్య తేల్చిచెప్పారు. 

read more టిడిపిలో నూతనోత్తేజం... చంద్రబాబు సమక్షంలో భారీ చేరికలు

కొడాలి నానికి మంచి, మర్యాద తెలిసుంటే, తనలో మానవత్వముంటే ఆయన తనభాషను మార్చుకోవాలని వర్ల సూచించారు. అన్నంతినేవారు, బుద్ధి, జ్ఞానం ఉన్నవారెవరూ నానిలా మాట్లాడరని, ఆయన సంగతైతే తనకి తెలియదని చెప్పారు.

పోలీస్‌వ్యవస్థలో డీజీపీ సుప్రీం అయినప్పటికీ, ఆయనతోపాటుగా ఆరుగురు అడిషనల్‌ డైర్టెర్స్‌ ఆఫ్‌ జనరల్‌ పోలీసులు ఉన్నారని, చంద్రబాబు పర్యటనలో పోలీస్‌శాఖ వ్యవహరించిన తీరు సరిగా ఉందో లేదో వారే సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షనేతపై జరిగిన దాడికి సంబంధించి సమాధానం చెప్పే, అర్హతను తన దృష్టిలో డీజీపీ కోల్పోయాడని వర్ల తెలిపారు. 

read more  డబ్బుకోసం కొడుకునే కిడ్నాప్ చేసిన ప్రబుద్దుడు...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జెడ్‌ప్లస్‌ భద్రత ఉన్నవ్యక్తి పర్యటిస్తుంటే సెక్షన్‌-30 అమలుచేయకుండా నిరసనలకు ఎలా అనుమతించారో ఆరుగురు అడిషనల్‌ డీజీపీలు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుపై దాడిచేయడానికే  వైసీపీ వారికి పోలీసులు అనుమతి ఇచ్చారా అని వర్ల నిలదీశారు. ఏపి డీజీపీ చర్యపై ఢిల్లీస్థాయి లో నిలదీస్తామని, ఆయనకు పైనున్నవ్యవస్థ తలుపుతడతామని రామయ్య స్పష్టంచేశారు.