గుంటూరు:  డబ్బు కోసం  కన్న కొడుకుని తండ్రే కిడ్నాప్ చేయించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి సదరు బాలుడి పెదనాన్న కిడ్నాప్ డ్రామాకు తెరదించారు. ఇలా కేవలం ఐదు గంటల్లోనే చిన్నారిని కాపాడిన పోలీసులు తల్లి ఒడికి చేర్చారు. 

వివరాలలోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని పిల్లుట్ల రోడ్ లో నివాసముంటున్న శాగలంపూడి శివ అనే వ్యక్తి గురువారం అర్థరాత్రి తన తమ్ముడి కొడుకుని కిడ్నాప్ చేశాడు. రాత్రి రెండున్నర గంటల సమయంలో తన తమ్ముడు గాంధీ యొక్క ఐదు నెలల కుమారుడు సంతోష్ కుమార్ ను అపహరించుకుపోయాడు.  ఎక్కడో రహస్య ప్రాంతంలో బాలున్ని దాచి ఇంటికి చేరుకున్నాడు.

అనంతరం తనకు ఏమీ తెలియదన్నట్లుగా అందరితో కలిసి చిన్నారి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించాడు. అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు పోయినట్లు భావించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తనకు ఫోన్ చేసి ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్లు బాలుడి తండ్రి పోలీసులకు తెలిపాడు.

read more  రివర్స్ టెండరింగ్...చంద్రబాబు, లోకేశ్ ల భారీ దోపిడీకి అడ్డుకట్ట: బొత్సా

దీంతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులకు బాలుడి పెదనాన్న ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తానే పిల్లాడిని అపహరించినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే బాలున్ని అతడి నుండి కాపాడిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. 

పిడుగురాళ్ల పట్టణ సీఐ సురేంద్రబాబు ప్రత్యేక శ్రద్ద తీసుకుని తన సిబ్బందితో కలిసి కిడ్నాప్ జరిగిన కేవలం ఐదు గంటలలోపే కేసును చేధించి బాలుడిని సురక్షితంగా రక్షించారు. అపహరణకు గురైన బాలుడిని గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ చేతులమీదుగా తల్లికి అప్పగించారు.

read more  అమరావతిపై చంద్రబాబు ఆలోచన అది... జగన్ ది మాత్రం...: అనురాధ

ఈ సందర్భంగా అతితక్కువ వ్యవధిలో కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందికి రూరల్ ఎస్పీ విజయరావు అభినందనలు తెలియజేశారు. సీఐతో పాటు ఆయన సిబ్బందిని ప్రశంసించారు.