చంద్రబాబు వాహనంపై దాడి కేసు... సిట్ ఏర్పాటు

అమరావతి పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనపై ప్రత్యేక విచారణ కోసం సిట్ ను ఏర్పాటు చేసింది. 

special investigation team  appointed on attack on chandrababu vehicle in amaravathi

అమరావతి: టిడిపి అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వాహనంపై రాజధాని అమరావతి ప్రాంతంలో కొందరు నిరసనకారులు రాళ్లు, చెప్పులు, కర్రలతో దాడికి పాల్పడిన విషయం తెలసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ఘటనపై సమగ్రంగా, వేగంగా విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ను నియమించింది. 

గుంటూరు రూరల్ అడిషనల్ ఎస్పీని ఈ సిట్ బృందానికి ఇంచార్జ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘర్షణతో పాటు పోలీసులు అలసత్వంపై కూడా విచారణ చేయనున్న సిట్ బృందం తెలిపింది. 

చంద్రబాబు పై దాడికి పాల్పడినట్లు అనుమానిస్తూ ఇప్పటికే బాపయ్య, సందీప్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై తుళ్లూరు పోలీసు స్టేషన్ లో పెట్టిన కేసులతో ఇప్పటివరకు ఈ ఘటనపై జరిగిన విచారణ, సేకరించిన ఆధారాలు, పెట్టిన కేసులు సిట్ కి బదిలీ కానున్నాయి. 

read more  నేలను ముద్దాడిన చంద్రబాబు: ఎన్టీఆర్ వ్యాఖ్యలతో ట్రోలింగ్

చంద్రబాబు అమరావతి ప్రాంతంలో పర్యటిస్తుండగా సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబుతో పాటు టిడిపి సీనియర్లు, ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు  నిరసనకారులు రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. మరోవైపు పలు చోట్ల నల్ల జెండాలతో ఆందోళన తెలిపారు. దీంతో రాయపూడి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.

 ఈ పరిణామాలపై టీడీపీ నాయకులు, రాజధాని ప్రాంత రైతులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.... తమ జీవితంలోకి మళ్లీ రావొద్దు చంద్రబాబు అంటూ పలు బ్యానర్లు కట్టడ గమనార్హం. రాజధాని రైతుల పేరిట ఆ బ్యానర్లు ఏర్పాటు చేయడం గమనార్హం.  వైసీపీ నేతలే కావాలని ఇలా ఆందోళనలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  

కృష్ణానది కరకట్ట నుంచి రాయపూడి వరకూ ఈ ఫ్లెక్సీల్లో చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు. క్షమాపణలు చెప్పిన తర్వాత ఇక్కడ అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజధాని పేరుతో రంగురంగుల గ్రాఫిక్స్‌ చూపించి మోసం చేశారని ఆరోపించారు. పేద, దళిత రైతుల భూములు సింగపూర్‌ ప్రైవేట్ సంస్థలకు ఎందుకు కట్టబెట్టారో చెప్పాలన్నారు. భూములు ఇవ్వని రైతులపై కేసులు పెట్టించి, పోలీసులతో హింసించారో చెప్పాలన్నారు.

Chalo Amaravathi : చంద్రబాబు బస్సుపై చెప్పు విసిరిన ఆందోళన కారులు

ఇటు చంద్రబాబు పర్యటనపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా మండిపడ్డారు. ప్యాకేజీ పేరుతో దళిత సోదరులకు చేసిన మోసాన్ని ప్రపంచానికి చెప్పి.. బాబు పర్యటన కొనసాగించాలన్నారు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమరావతిలో బాబు శంఖుస్థాపన చేసిన.. నిర్మాణం పూర్తి చేసుకున్న 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అమరావతి పర్యటన ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios