అమరావతి: మాజీసీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి శంకుస్థాపన ప్రాంతంలో నేలకు సాష్టాంగ నమస్కారం చేసి ముద్దాడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు నాయుడు పర్యటనకు బయలుదేరారు. చంద్రబాబు నాయుడు పర్యటనకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు అమరావతి రైతులు. కొందరు బాబు పర్యటనను స్వాగతిస్తే మరికొందరు వ్యతిరేకించారు. 

చంద్రబాబు నాయుడుపై కొందరు రైతులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. దాంతో చంద్రబాబు నాయుడు కొన్ని ప్రాంతాల్లో కాన్వాయ్ నుంచి దిగలేని పరిస్థితి నెలకొంది. 

ఇకపోతే రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన శిలాఫలకం దగ్గరకు చేరుకున్న చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. శంకుస్థాపన చేసిన నేతలకు సాషాష్టంగ నమస్కారం చేసి నేలతల్లిని ముద్దాడారు. 

సాష్టాంగ నమస్కారం చేసిన చంద్రబాబు ఫోటో పెట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా సెటైర్లు వేస్తున్నారు. నాకంటే చంద్రబాబు మహానటుడు అంటూ దివంగత సీఎం ఎన్టీఆర్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. 

చంద్రబాబు నాయుడు, ఆయన తోడల్లుడు, ఎన్టీఆర్ పెద్దల్లుడులను విమర్శించిన పేపర్ క్లిప్పింగ్ లను కూడా పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్రమోదీపై చేసిన విమర్శల సమయంలో ఆయన హావా భావాలను కూడా గుర్తుకు తెస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష చేశారు. ఆసమయంలోనూ, ఢిల్లీ వెళ్లి మోడీపై యుద్ధం అంటూ పార్లమెంట్ ముందు ఒంగోని మీడియాకు పోజులు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు.  

అంతకు ముందు పార్లమెంట్ ముందు మోడీ మోకరిల్లిన సీనే చంద్రబాబుకు గుర్తుకు వచ్చిందే ఏమో కానీ, చంద్రబాబు కూడా అలాంటి పోజు ఒకటి ఇచ్చాడు. మీడియా వైపు చూస్తూ  చంద్రబాబు నాయుడు ఒంగోని పార్లమెంట్ మెట్లను మొక్కడం ఆయన అనుకూల మీడియాలో మొదటి పేజీల్లో వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
 
తాజాగా మళ్లీ అమరావతిలో సాష్టాంగ నమస్కారం పెట్టిన ఫోటోలు, వంగి దండం పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చంద్రబాబు ఇలా ఒంగోని దండాలు పెట్టడం మాత్రం ఇప్పుడు ఆపేలా లేరంటూ తెగ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. 

ఈ వార్తలు  కూడా చదవండి

#TDP Chalo Amaravathi అమరావతిలో చంద్రబాబు పర్యటన(ఫోటోలు)

Chandrababu Amaravati tour: శంకుస్థాపన చోటును ముద్దాడి చంద్రబాబు భావోద్వేగం