Asianet News TeluguAsianet News Telugu

రాయలసీమ రాజధాని అవసరమే లేదు... కావాల్సిందిదే: మంత్రి పెద్దిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై ఇప్పటికు వివాదం చెలరేగుతున్న సమయంలో మంత్రి పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాారు.  

peddireddy  ramachandra reddy shocking comments on ap capital
Author
Amaravathi, First Published Dec 30, 2019, 5:33 PM IST

అమరావతి:  రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతులకు ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి ఇవ్వొచ్చని పంచాయతీ రాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కోన్నారు.  రాజధాని రైతుల భూములను ఎవరు లాక్కుని వెళ్ళటం లేదు కాబట్టి వారు నిశ్చింతగా వుండోచ్చని  మంత్రి  అన్నారు. 

బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ నివేదిక జనవరి 3 తేదీన వస్తుందన్నారు. ఆ తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం ఉంటుందన్నారు. అభివృద్ది చెందిన ప్రాంతాలనే మళ్లీ అభివృద్ది చేయడం కాకుండా ఇతర ప్రాంతాలను కూడా వాటితో సమానంగా  తీర్చిదిద్దాలని తాము భావిస్తున్నామని... వారు బాగుపడటం మీకు అక్కరలేదా అని అమరావతి ప్రాంత ప్రజలను మంత్రి ప్రశ్నించారు.

సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ద్వారా  రాష్ట్రమంతటా సమాన అభివృద్ధి జరుగుతుందన్నారు. రైతులకు న్యాయం చేయాలనే సీఎం  చూస్తున్నారని అన్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సేవలు చంద్రబాబు కూడా గతంలో చాలా సార్లు తీసుకున్నారని మంత్రి గుర్తుచేశారు.

READ MORE  ఎట్టి పరిస్థితుల్లో అది జరిగితీరాలి: అధికారులకు సీఎం ఆదేశం

పదేళ్లు హైదరాబాద్ ను రాజధానిగా వాడుకునే అవకాశమున్నా వదిలేసి అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. కేవలం రాజధానికి పేరుతో ఆయన కేవలం వ్యాపారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు నమ్మి భూమిలిచ్చిన రైతులకు జగన్ ఎలాంటి అన్యాయం చేయరని... మంచి ప్యాకేజి ఇచ్చి రైతులకు న్యాయం చేస్తారని తెలిపారు.

గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని రోడ్డుపాలు చేశారని అన్నారు. 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసేయాలంటే సాధ్యం కాదని...  తగుమాత్రంలో భూమి తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ల్యాండ్ పూలింగ్ అని కొత్త విధానంలో భూమిని తీసుకున్నారని... మళ్ళీ అదే విధానంలో తిరిగి వెనక్కు కూడా ఇవ్వొచ్చని తెలిపారు. 

రాయలసీమకు కావాల్సింది సచివాలయం కాదు... ముడుపుటలా తాగు, సాగు నీళ్లు మాత్రమే...రాజధాని ఎక్కడ ఉన్నా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికిప్పుడు  అమరావతి రైతులతో మాట్లాడాల్సిన పని లేదని... వారు మాట వినరని కూడా తమకు తెలుసని మంత్రి పెద్దిరెడ్డి మనసులో మాట బైటపెట్టారు.

read more  జర్నలిస్టుల కంటే కాకులే నయం... క్రూర జంతువు మాదిరిగా: పేర్ని నాని

ఇక ఇసుక విధానం గురించి మంత్రి  మాట్లాడుతూ ఇప్పటికి 350 రీచ్ ల ద్వారా ఇసుక తీస్తున్నామన్నారు. రోజూ 80 వేల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా అవుతోందన్నారు. ఇప్పటి వరకు 9 లక్షల 63 వేల టన్నుల తవ్వి తీసామని  వెల్లడించారు. 

కొన్ని చోట్ల ఇసుక ఇబ్బందులు ఉన్నాయని... స్టాక్ పాయింట్ ల నుంచి ఇసుక తీసుకునేందుకు కొందరు ఇంకా అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. 155 స్టాక్ యార్డుల్లో 13 చోట్ల ఇసుక వెంటనే అయిపోతోందని... అందుకే డోర్ డెలివరీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. పైలెట్ ప్రాతిపదికన కృష్ణా జిల్లాలో డోర్ డెలివరీ చేస్తామన్నారు.

ఏడో తేదీ నుంచి ఉభయగోదావరి, కడప జిల్లాలో డోర్ డెలివరీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 389 చెక్ పోస్టుల్లో నిఘా ఉంచుతున్నామని...  ఏపీఎండిసి ద్వారా డోర్ డెలివరీ చేయిస్తామన్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఇసుక సరఫరా నియంత్రణ చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

ఇసుక గురించి ఎక్కువ విమర్శలు వచ్చాయని... అందుకే అంతా పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం  భావిస్తోందన్నారు. కొత్త ఇసుక విధానం ద్వారా 150 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. రవాణా ఛార్జీలను నియంత్రించాలనే  డోర్ డెలివరీ ప్రాజెక్టు చేపట్టామని... జనవరి 20 లోగా అన్ని జిల్లాల్లోను ఈ ప్రాజెక్టు అమలు అవుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios