యువతకు ఉద్యోగాలిచ్చిమరీ జగన్ చెడగొడుతున్నారు...ఇదే ఉదాహరణ...: పంచుమర్తి అనురాధ
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలిచ్చిమరీ యువతను చెడగొడుతున్నారని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు.
గుంటూరు: వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమం గురించి అలోచించకుండా సంక్షేమం పేరుతో సంక్షోభం స్పష్టిస్తోందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఈ ప్రభుత్వ అండదండలతో గ్రామాల్లో వైసీపీ నాయకులు నిరుపేద ప్రజలతో రాజకీయ క్రీడ అడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికే టీడీపీ సానుభూతి పరులు, వైసీపీకి ఓటు వేయని వారి పింఛన్లు దాదాపు 7లక్షలు తీసివేశారని ఆరోపించారు.
''కొంతమంది వాలంటర్లు లంచాలు తీసుకుంటున్నారు. కపడ జిల్లా చాపడ మండలం పల్లవోలు, బాదరుపల్లి ఏరియాల్లో పింఛను ఇవ్వమని అడుగుతుంటే బలవంతంగా రూ.500లంచాలు తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రూ.లక్ష కోట్లు దోచుకున్నారు కాబట్టి యువతకి ఉద్యోగాలు ఇచ్చి వారిని కూడా చెడగొడుతున్నారు'' అని విమర్శించారు.
పెన్షన్లను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.200 నుంచి అమాంతం రూ.2000కు పెంచడం జరిగిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ కేవలం రూ.250 మాత్రమే పెంచి దానిపై కూడా నానా రాద్దాతం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం హయాంలో 54లక్షల 25వేల పింఛన్లు మంజూరు చేసి ఆన్ లైన్లో ప్రతినెలా 1వ తేదీన లబ్దిదారుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేవని అన్నారు.
తాజాగా 60లక్షల పింఛన్లు ఇచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం చెబుతున్న మాటలు పచ్చి అబద్దమని అన్నారు. కానీ ఈరోజు డ్యాష్ బోర్టులో 52లక్షలు మాత్రమే ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు.
వాలంటీర్లకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు నెలకు రూ.600కోట్లు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అందుకోసం పేద ప్రజల పోట్టగొడుతోందని మండిపడ్డారు. ఇలా చేయడానికి ప్రభుత్వానికి ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నించారు. పింఛన్లు సరైన సమయానికి రాకపోవడం ఓపక్క.... పల్లెల్లో వైసీపీ నాయకులు చేసే తప్పు రాజకీయాలు మరోపక్క వేదించడంతో ఎంత మంది బలైపోతున్నారో మీరు గమనించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కర్నూలు పింఛన్ల రాక ఒక వ్యక్తి మృతి చెందారని తెలిపారు. పండుటాకులకు గుండె కోత అని పేపరులో రాయడం జరిగింది..దీనికి వైసీపీ ఏమి సమాధానం చెబుతోందని అడిగారు. శ్రీశైలంలో తనికెళ్ల భరణి అనే వృద్దుడు పింఛన్ల తోలగించడంతో మరణించాడని... దీనికి వైసీపీ ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.
అలాగే అనంతపురం జిల్లా ధర్మవరంలో కూడా పింఛన్ రాలేదని ఓ వ్యక్తి అత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. ఈ మరణాలపై ప్రభుత్వం స్పందించాలని అనురాధ డిమాండ్ చేశారు.
read more మంత్రులను చెప్పులతో కొట్టడం ఖాయం...: బోండా ఉమ
చంద్రబాబునాయుడు హయాంలో కోటి 46లక్షల మందికి రేషన్ కార్టులు ఉన్నాయన్నారు. రేషన్ కార్టు వలన ప్రభుత్వం అందించే చాలా సంక్షేమ పథకాలను అర్హులవుతారని అన్నారు. అయితే ఈ ప్రభుత్వం రేషన్ కార్డులను కూడా భారీగా తొలగించడం వల్ల చాలా నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ పథకాలను దూరమయ్యే పరిస్థితి ఏర్ఫడిందన్నారు.
ఏకంగా 20లక్షల రేషన్ కార్టులు కారణం లేకుండా తొలగించార అనురాధ ఆరోపించారు. దీనిపై కూడా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
''ఎవరికో 50సెంట్లు భూమి ఉంటే 10 ఎకరాలు ఉన్నాయని చెబుతారు.. అడుక్కునే వ్యక్తి పింఛన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఆమె ఇన్ కమ్ ట్యాక్స్ కడుతుందని చెబుతారు. మరొకరు 300 యూనిట్లు కరెంట్ వినియోగించారని పింఛన్ తోలిగించారు. దళితులను, బడుగు, బలహీన వర్గాలను టార్గెట్ చేసిమరీ అల్లకల్లోళం స్పష్టిస్తున్నారు'' అని ఆరోపించారు.
''చంద్రబాబనాయుడు హయాంలో ప్రతి మనిషికి 5కేజీల బియ్యం అందించారు. అదే కాకుండా వైఎస్ హయాంలో కుటుంబానికి ఇన్ని కేజీలు మాత్రమే ఇవ్వాలనే నిబంధనను తొలగించిన ఘనత చంద్రబాబునాయుడిది. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఆ బియ్యం కూడ లేకుండా చేస్తున్నారు. వైసీపీ పుట్టగతులు ఉంటాయా? పేద ప్రజల ఏడ్పు మీకు కొట్టదా? ఎందుకు ఇంత దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నారు?'' అని మండిపడ్డారు.
''అమ్మఒడి, రైతు భరోసా ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. అమ్మఒడి పథకానికి 81లక్షల మంది అర్హలు ఉంటే కేవలం 41లక్షలకు మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు'' అని ఆరోపించారు.
''వైసీపీ ప్రభుత్వం హయాంలో అడవారు కూడా మద్యం రేట్లు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక క్వాటర్ పై రూ.100 అదనంగా పెంచారు. అంటే ఒక వ్యక్తి నెల రోజులు తాగితే రూ.3000 ఖర్చుఅవుతోంది. అదే రెండు క్వాటర్లు తాగితే 30 రోజులకు రూ.6వేల ఖర్చు అవుతోంది. అంటే సంవత్సరానికి దాదాపు రూ.72వేలు వారి దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వం వసూలు చేస్తున్నారు.వైసీపీ ఐదు సంవత్సరాలకు కాను దాదాపు రూ.4లక్షలు దాటి ఖర్చు అవుతోంది'' అని లెక్కలతో సహా వివరించారు.
read more వికేంద్రీకణ బిల్లును మేం వ్యతిరేకించలేదు...: యనమల రామకృష్ణుడు
'' అమ్మఒడి ద్వారా రూ.15వేలు వేసి పేద ప్రజల నుంచి రూ.72వేల దోచుకుంటు పేద ప్రజల రక్తాన్ని పిల్చీ డబ్బులను మీ జేబుల్లో వేసుకుంటునందుకు మీకు హ్యాట్సాప్.
ముద్దాయి ముఖ్యమంత్రి అయితే పాలన ఏ రకంగా ఉంటుందో క్లియర్ గా కనిపిస్తోంది'' అంటూ అనురాధ విమర్శించారు.
''చంద్రబాబునాయుడు కట్టిన పోలీసు స్టేషన్ లోకి వెళ్ళి దిశా పోలీసు స్టేషన్ల పేరుతో నిస్సిగ్గుగా ప్రారంభం చేస్తున్నారు. దిశా చట్టం ద్వారా ఎవరైనా 21 రోజుల్లో శిక్షిస్తామని చెప్పిన మీరు మరి 21 రోజుల్లో వైసీపీ నాయకులు బెయిల్లు ఎలా తెచ్చుకుంటున్నారు? హత్యాచారాలు చేసిన వైసీపీ కార్యకర్తలకు బెయిల్లు ఇప్పించి తిరుగుతుంటే మీరు దిశా చట్టం గురించి మాట్లాడుతారా? ''అని మహిళా భద్రతపై ప్రశ్నించారు.
''వైసీపీ నాయకులకు పరిపాలనపై జాస లేదు.. ఎంత సేపు కేసులను ఏ విధంగా మాఫీ చేసుకోవాలి.. మాఫీ చేసుకోవటానికి ఎవరికి వంగి..వంగి దండాలు పెట్టాలి.. ఎవరికి గిప్ట్ లు ఇవ్వాలి.. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులతో మంతనాలు చేయడానకి దారులు వెతుకునే ప్రయత్నం తప్ప మీకు పరిపాలనపై ఏమాత్రం పట్టు లేదు'' అన్నారు.
''సంక్షేమ పథకాల ముసుగులో వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారు. గతంలో చంద్రబాబునాయుడు హయాంలో ఏ పథకం డబ్బు అయినా బయోమెట్రిక్ ద్వారా 1వతేదిన వారి ఖాతాలో జమ చేయడం జరిగేది. అంతే కాకుండా పింఛన్ల 11గంటల కల్ల అందరికి ఇవ్వడం జరుగుతుండేది. ఈరోజు 10వతేదీ ఇంత వరకు అతీగతిలేదు'' అంటూ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.