మంత్రులను చెప్పులతో కొట్టడం ఖాయం...: బోండా ఉమ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ విజయవాడలో ధర్నా చేపట్టారు.
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే పని చేయలేదని టిడిపి మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. ఏ ప్రభుత్వమయినా మరిన్ని కొత్త పథకాలను తీసుకువచ్చి మరింత ఎక్కువమంది ప్రజలకు సంక్షేమ పలాలు అందించాలని చూస్తుంది కానీ వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపిది మాత్రం రద్దుల ప్రభుత్వమని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పెన్షన్ లు, రేషన్ కార్డులు పునరుద్ధరించాలని టిడిపి ఆందోళనల బాట పట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు.
read more వికేంద్రీకణ బిల్లును మేం వ్యతిరేకించలేదు...: యనమల రామకృష్ణుడు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రద్దుల ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడని సైటైర్లు వేశారు. గతంలో టిడిపి అధికారంలో వున్నప్పుడు అర్హులైన 56 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామన్నారు. ఎప్పుడయితే ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిందో వెంటనే 7 లక్షల పైచిలుక మంది నిరుపేదలకు పెన్షన్లను రద్దు చేశారని ఆరోపించారు.
ఇక రేషన్ కార్డుల విషయంలో మరింత ఘోరంగా వ్యవహరించారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల రేషన్ కార్డులు అకారణంగా రద్దు చేశారని ఆరోపించారు. బాద్యతాయుతమైన మంత్రి పదవుల్లో వున్నావారు రేషన్ కార్డులు, పింఛన్ లపై ఎవరిష్టానికి వారు రోజుకో ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా ప్రకటనలు చేస్తున్న వైసీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యే లు డివిజన్ లలో, గ్రామాల్లో తిరిగితే ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చరించారు.
read more చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టోకరా: కిలాడీ లేడీ దీప్తి అరెస్టు
ఇక వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రామ సచివాలయల వ్యవస్థ మొత్తం అవినీతిమయంగా మారిందన్నారు. దానివల్ల ప్రజలకు ఉపయోగమేమీ లేదని... అందులో కిందిస్థాయి నుండి పైస్థాయి వరకు అవినీతి రాజ్యమేలుతోందని బోండా ఉమ మండిపడ్డారు.