గుంటూరు: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కుటుంబసభ్యులతో కలిసి భారత్ లో చేపట్టిన రెండు రోజుల పర్యటన ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించింది. ముఖ్యంగా ట్రంప్ కుటుంబానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి జగన్ కు ఆహ్వానం లభించకపోవడంపై అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య మాటలయుద్దం కొనసాగుతోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి మరోఅడుగు ముందుకేసి ట్రంప్ ను ఏపికి రప్పించే అవకాశాన్ని సీఎం జగన్ వల్లే కోల్పోయామని ఆరోపించారు. 

తెలుగువారికి అన్న ఎన్టీఆర్ ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రపంచస్థాయి కంపెనీలను ఏపీకి తీసుకొచ్చారని కొనియాడారు. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన సమయంలో చంద్రబాబు అమెరికా, బ్రిటన్ సహా అగ్ర దేశాల అధినేతలను రాష్ట్రానికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపికి చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండుంటే ట్రంప్ కూడా ముందుగా ఏపీకే వచ్చేవారని... వైఎస్ జగన్ వున్నాడు కాబట్టే రాలేడన్నారు.   

read more  ట్రంప్ విందుకు జగన్ కు రాని ఆహ్వానం: చంద్రబాబు వ్యాఖ్యలకు బొత్స కౌంటర్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ఇచ్చిన విందుకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఆహ్వానించలేదో వైసీపీ నేతలు చెప్పగలరా? అనిప్రశ్నించారు.  జగన్ కు పిలుపు రాకపోవడంపై సిగ్గు పడకపోగా వైసీపీ నేతలు వెకిలి నవ్వులు నవ్వుతున్నారని మండిపడ్డారు. జగన్ నేర చరిత్ర ఆంధ్ర రాష్ట్రానికి అంటుకుంది కాబట్టే విందుకు పిలుపు రాలేదన్నారు.  

జగన్ అనుసరిస్తున్న విధానాలు, ఆయనపై ఉన్న అక్రమ కేసుల వల్లే ట్రంప్ విందుకు ఆహ్వానం అందలేదని ఆరోపించారు. అలాగే అరెస్ట్ భయంతోనే  సీఎం జగన్ దావోస్ సదస్సుకు వెళ్లలేదని... గతంలో చంద్రబాబు ఇదే దావోస్ పర్యటనతో ఎన్నో పరిశ్రమలు ఏపీకి తీసుకువచ్చారని అనురాధ తెలిపారు. 

read more చంద్రబాబు ఓటమి ట్రంప్ కు కోపం తెప్పించిందా...అందుకే జగన్ కు..: కన్నబాబు