Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు పిలుపు: నన్నపనేనిపై అట్రాసిటీ కేసు

నన్నపనేని రాజకుమారి, మహిళా నేత సత్యవాణిలు తనను కులంపేరుతో దుర్భాషలాడారని దళిత మహిళా పోలీసు అధికారి,పెదకాకాని ఎస్ఐ అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత మహిళా ఎస్‌ఐ అయిన తనపట్ల దురుసుగా మాట్లాడి, తన విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఎస్‌ఐ అనురాధ వారిపై ఫిర్యాదు చేశారు. 

SCST atrocity case filed against ex woman commission chairperson Nannapaneni rajakumari
Author
Guntur, First Published Sep 12, 2019, 8:56 AM IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. మంగళగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.

చలో ఆత్మకూరు నేపథ్యంలో చంద్రబాబు నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నన్నపనేని రాజకుమారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను మంగళగిరి పీఎస్ కు తరలించారు. 

ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి, మహిళా నేత సత్యవాణిలు తనను కులంపేరుతో దుర్భాషలాడారని దళిత మహిళా పోలీసు అధికారి,పెదకాకాని ఎస్ఐ అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత మహిళా ఎస్‌ఐ అయిన తనపట్ల దురుసుగా మాట్లాడి, తన విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఎస్‌ఐ అనురాధ వారిపై ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేశారు పోలీసులు. 

నన్నపనేని రాజకుమారి ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా పనిచేశారు. సాటి మహిళ అని కూడా చూకుండా దూషణకు దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను కష్టపడి ఉద్యోగం సంపాదించానని తనను దరిద్రురాలు అంటారా అంటూ ఎస్సై మండిపడ్డారు. 

దళితులు వల్లే ఈదరిద్రం అంటూ నన్నపనేని రాజకుమారి అన్నారని ఆమె ఆరోపించారు. ఇంతలో మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కలుగజేసుకుని సర్ధిచెప్పే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే.   
 

ఈ వార్తలు కూడా చదవండి

నన్నపనేనిపై మహిళా ఎస్సై ఆగ్రహం: దళితుల వల్లే దరిద్రం అంటారా అంటూ ఫైర్

పోలీసుల అదుపులో నన్నపనేని రాజకుమారి

Follow Us:
Download App:
  • android
  • ios