టాయిలెట్లు లేని సెక్రటేరియట్... నారాయణ కాలేజీల్లా బిల్డింగులు: అమరావతిపై పేర్ని నాని కామెంట్స్
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి వేదికన జరిగిన మంత్రిమండలి సమావేశం కాస్సేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక పథకాలకు మంత్రిమండలి ఆమోదం లభించింది.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఏపి మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక పథకాలకు మంత్రిమండలి ఆమోదం లభించింది. ఆయా పథకాలకు సంబంధించిన వివరాలతో పాటు సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.
''జగనన్న విద్యాదీవెన,జగనన్న వసతి దీవెన పథకాలకు క్యాబినెట్ ఆమోదం లభించింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పిస్తున్నాం. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద ఆర్థిక సాయం అందిస్తాం'' అని మంత్రి వెల్లడించారు.
విద్యా దీవెన పథకానికి రూ.3,400 కోట్లు, వసతి దీవెన కింద 2,300 కోట్లు ఏటా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఫీజు రీయింబర్సుమెంట్ కు సంబంధించిన నిబంధనల సడలించనున్నట్లు తెలిపారు.
read more క్షుద్రపూజల కలకలం: స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 ఏళ్ళు నిండిన కాపు మహిళలకు ఏటా 15వేల ఆర్థిక సాయం ఇచ్చేందుకు క్యాబినెట్ అనుమతి లభించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ఈ ఏడాది కాపు మహిళలకు 1,101 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ,సీపీఎస్ రద్దుకు అధికారులతో కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్ల జీతాల పెంపుకు అవసరమైన 14.46 కోట్లు విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు.
రేషన్ బియ్యం కార్డుల జారీకి గతంలో ఉన్న నిబంధనలు సడలించనున్నట్లు తెలిపారు. ఏపిఎస్‌పిడిసిఎల్ ను విభజించి కృష్ణా,గుంటూరు,ప్రకాశం జిల్లాలతో సెంట్రల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం లభించింది. వచ్చే ఉగాదికి 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్ని నాని వెల్లడించారు.
read more స్థానికులకే మొదటి ప్రాధాన్యత...అందుకోసమే ప్రత్యేక చట్టం: అవంతి
ప్రతిపక్ష నేత చంద్రబాబు కు అమరావతిలో తిరిగే నైతిక అర్హత ఉందా...? అని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని...ఆయన్ను ను నమ్ముకుని భూములిచ్చిన రైతులకు ఎలాంటి సౌకర్యాలుకల్పించారని మంత్రి ప్రశ్నించారు. భూములిచ్చిన రైతులకు ప్లాట్ లు ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు.
రాజధానికి రావాలంటే ఇప్పటికీ ఒక్క మంచి రోడ్డు లేదు...సెక్రటేరియట్ నారాయణ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. సెక్రటేరియట్ కి వస్తే కనీసం టాయిలెట్ కూడా లేదన్నారు. ఏ అర్హత ఉందని చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తారు...మోసం చేసిన ప్రజల ముందుకు ఏ మొహం పెట్టుకొని వెళ్తారు? అని అని పేర్నినాని ప్రశ్నించారు.