Asianet News TeluguAsianet News Telugu

క్షుద్రపూజల కలకలం: స్పందించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

శ్రీకాళహస్తి సమీపంలోని కాలభైరవ ఆలయంలో క్షుద్రపూజలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు

ap endowment minister vellampalli srinivas reacts black magic issue in srikalahasti
Author
Amaravathi, First Published Nov 27, 2019, 12:47 PM IST

శ్రీకాళహస్తి సమీపంలోని కాలభైరవ ఆలయంలో క్షుద్రపూజలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

శ్రీకాళహస్తి సమీపంలోని వేడం కాలభైరవ ఆలయంలో మంగళవారం అర్థరాత్రి క్షుద్రపూజలు జరిగాయి. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.

వారు ఇచ్చిన సమాచారంతో శ్రీకాళహస్తి దేవస్థానం ఏఈవో ధన్‌పాల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆలయ సెక్యూరిటీ గార్డుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also: క్షుద్రపూజల కలకలం: శ్రీకాళహస్తి ఏఈవో అరెస్ట్

కొద్దిరోజుల క్రితం సింహాచలం ఆలయానికి సమీపంలోని భైరవకోనలోని భైరవస్వామి ఆలయంలో రెండు గంటల పాటు పూజలు, హోమాలు జరిగిన ఘటన దుమారాన్ని రేపింది. ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారి సింహాచలం దేవస్థానం కార్య నిర్వాహణాధికారి కె. రామచంద్ర మోహన్ గా పేర్కొంటున్నారు.

ఆయన తన బంధువుల కోసం ఆలయంలో హోమాలు,పూజలు నిర్వహించారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈవో ఆదేశాలపై సింహాచలానికి చెందిన ఐదుగురు పండితులు భైరవస్వామి ఆలయానికి వచ్చి వింత పూజలు జరిపినట్లు సమాచారం.

Also Read:150 పశువులు అమరావతిని నాశనం చేస్తున్నాయి: వైసీపీపై బొండా తీవ్ర వ్యాఖ్యలు

స్వామి దర్శనానికి వచ్చిన భక్తులను లోపలికి రానీయకుండా,.. బయటనే ఉంచి తాళాలు వేసిమరీ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. సాధారణంగా అమావాస్య వేళల్లో భైరవస్వామిని దర్శించుకోవడానిక భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. వారిని స్వామివారిని దర్శించుకోనివ్వకుండా ఇలా చేయడంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios