చంద్రబాబు దత్తపుత్రుడు: పవన్ కల్యాణ్ కు పెద్దిరెడ్డి కౌంటర్
తమ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టారు మంత్రి పెద్దిరామచంద్రారెడ్డి. కేవలం చంద్రబాాబునే కాదు మాజీ మంత్రి లోకేశ్, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్,మాజీ సీఎం కిరణ కుమార్ రెడ్డి తమ్ముడిపై కూడా మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతి: సీఎం జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు సొంత పుత్రుడు దత్త పుత్రుడు మాట్లాడడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్ర రెడ్డి లోకేశ్, పవన్ కల్యాణ్ లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నుండి కింది స్థాయి నాయకుడు వరకు గత ప్రభుత్వం లో ఇసుకను దోచేశారని, ఆశాస్త్రియంగా వారు చేసిన ఇసుక దోపిడీని అరికట్టడానికి మేము ప్రయత్నం చేసామని తెలిపారు.
చంద్రబాబు వర్షాకాలం లోను ఇసుక తీశారని, ఎందుకంటే ఆయన ఉంటే వర్షాలు రావు కదా అని ఎద్దేవా చేశారు.137 స్టాక్ పాయింట్స్ ను 180 స్టాక్ పాయింట్స్ పెంచుతున్నామని, ఇసుక వారోత్సవాలు 14 నుండి 21 వరకు నిర్వహిస్తున్నామన్నారు.
ఏపిఎండీసి ఆధ్వర్యంలో పర్యావరణానికి హాని లేకుండా ఇసుక తవ్వకాలు ఉండాలని అధికారులకు సూచించారు. సిబ్బంది ఇకనుండి సెలవులు లేకుండా ప్రజలందరికి ఇసుక సమృద్దిగా లభించేవరకు పనిచేయాలన్నారు. చంద్రబాబుకు పని లేనట్టు ఇసుకను అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాడని..అతడికి కొడుకు లోకేశ్, దత్తపుత్రుడు పవన్ సహాయం చేస్తున్నాడని పేర్కొన్నాడు. ఇప్పుడు చంద్రబాబు ధర్నా అంటున్నాడన్నారు.
read more అలా వుండాలి.... కేవలం నావల్లే ఇసుక మాఫియాకు చెక్..: చంద్రబాబు
కొందరు నీళ్లు తగుతారు, కొందరు గాలిపిలుస్తారు,చంద్రబాబు ఇసుక మీద బయట పడుతాడని... పవన్ గతంలో అవినీతి ఆంధ్ర ప్రదేశ్ అన్నారని గుర్తు చేశారు. ఇసుక ను 3000 నుండి 15000 కు పెంచేశారని అని టిడిపి నాయకుల ఆరోపణల వీడియో పెద్ది రెడ్డి ప్రదర్శించారు. 4 రోజుల్లో 90 వేల మెట్రిక్ టన్ను నుండి 1.21 టన్స్ తిస్తున్నామని ఆయన ప్రకటించారు.
ఇసుక అందుబాటులో కి వస్తే ఇసుక అక్రమ రవాణా చేయకుండా 150 నుండి 200 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయనున్నట్లు...అక్కడ ఇద్దరి కానిస్టేబుల్ లు కూడా 3 షిఫ్ట్ లలో పర్యవేక్షిస్తారని తెలిపారు. రెండు వైపులా సీసీ కెమెరాల ఉంచుతామన్నారు.
read more అనంతపురంలో ఉద్రిక్తత... టిడిపి నాయకుడిపై వైసిపి కార్యకర్తల దాడి
ఇసుక అక్రమ రవాణా చేస్తే 2లక్షలు ఫైన్ తో పాటు 2 సంవత్సరాలు శిక్ష వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక దందా వల్లే చంద్రబాబు ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయిందని.. తాము గతం లో ఎర్రచందనం ను కాపాడేందుకు డీఎఫ్‌వో లకు ఆయుధాలు ఇచ్చామని...ఇలా పోలీసులకు ప్రొటెక్షన్ ఇచ్చామని గుర్తుచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన తమ్ముడు కిశోర్ కుమార్ రెడ్డి ఎర్రచందనం దోచుకున్నారన్నారు. బాబుకు భయపడి వారోత్సవాలు పెట్టలేదని.. ఇసుక సమస్య తొలగింది కనుక 14 నుండి ఇసుక వారోత్సవాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. .