Asianet News TeluguAsianet News Telugu

అలా వుండాలి.... కేవలం నావల్లే ఇసుక మాఫియాకు చెక్..: చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక మాఫియాకు తనవల్లే అడ్డుకట్ట పడిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ తనను చూసి భయపడుతున్నారని అన్నారు.  

Chandrababu Naidu to fast over sand shortage in Andhra Pradesh
Author
Amaravathi, First Published Nov 12, 2019, 5:38 PM IST

విజయవాడ:  35లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సమస్యపై వైసిపి నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారని టిడిపి  అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు.  ఇంత పెద్ద ఎత్తున ఆత్మహత్యలు గతంలో రాష్ట్ర చరిత్రలో లేవని,  ఇన్ని ఆత్మహత్యాయత్నలు రాష్ట్రంలో మున్నెన్నడూ జరగలేదని ఆయన  అన్నారు. ఇసుక కృత్రిమ కొరతకు, వైసిపి ప్రభుత్వ హత్యలకు నిరసనగా ఈ నెల 14న విజయవాడలో 12గంటల దీక్ష చేపట్టనున్న నేపథ్యంలో కృష్ణా,గుంటూరు జిల్లాల టిడిపి నాయకులతో  టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

స్పందనలో వినతులు ఇచ్చిన చేతులతోనే పురుగుమందు తాగుతున్నారని, ఎమ్మార్వో,ఎండివో కార్యాలయాలకు పెట్రోల్ సీసాలతో వెళ్తున్నారని, వైసిపి వేధింపులు భరించలేకే ఆవేదనతో జనం ఈ పనులకు పాల్పడుతున్నారు మండిపడ్డారు. ఈ పెడ ధోరణులకు వైసిపి నేతల అరాచకాలే కారణమని, నిన్న పెద్ద డోర్నాలలో ఇద్దరు మహిళా ఉద్యోగుల ఆత్మహత్యాయత్నాలు బాధాకరమన్నారు. ఉద్యోగాలు తొలగిస్తామన్న వేధింపులే దీనికి కారణమని పేర్కొన్నారు.

read more  అనంతపురంలో ఉద్రిక్తత... టిడిపి నాయకుడిపై వైసిపి కార్యకర్తల దాడి

పేదల కడుపుకొట్టి వైసిపి కార్యకర్తల పొట్టలు నింపుతున్నారని విమర్శించారు. వీవోఏల జీతాలు ఒక చేత్తో పెంచి... మరో చేత్తో వారిని ఉద్యోగాలనుంచి తీసేస్తున్నారన్నారు. 
వైసిపి కార్యకర్తలకు ఉద్యోగాల కోసం మరొకరి పొట్ట కొట్టడం అమానుషమని మండిపడ్డారు. 

డ్వాక్రా సంఘాలను స్వతంత్రంగా పనిచేసేలా టిడిపి ప్రభుత్వం  చేసిందని తెలిపారు. గతంలో ఎన్టీఆర్ హయాంలోనే మ్యాక్స్ చట్టం తెచ్చామనిదీని ప్రకారం ఆయా సంఘాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదన్నారు. నిర్ణయాలను ఆయా సంఘాలే స్వతంత్రంగా తీసుకోవాలనిసూచించారు. 20ఏళ్లుగా పనిచేస్తున్నవాళ్లను తొలగించడం అన్యాయమని...
6,400మంది పశుసఖిలను రోడ్డుమీదకు నెట్టారని ద్వజమెత్తారు.

27వేల సంఘమిత్రల జీవితాలతో ఆడుకుంటున్నారని... వారం రోజులుగా పశుసఖిలు నిరాహార దీక్షలు చేస్తున్నా స్పందన లేదని మండిపడ్డారు. మహిళా సాధికారత కోసం టిడిపి చేసిన కృషిని నీరుగార్చారని అన్నారు.  

read more  ఇంటర్ విద్యార్థినికి క్యాన్సర్: చికిత్సకు బాలకృష్ణ చేయూత

ఇసుక కొరత అనేది గతంలో ఏపి చరిత్రలోనే లేదని.... ఆహార కొరత, విద్యుత్ కొరత, గ్యాస్ కొరత, నీటి కొరత విన్నాం కానీ ఇసుక కొరత ఇప్పుడే చూస్తున్నామన్నారు. లేని ఇసుక కొరత సమస్యను వైసిపి నేతలే సృష్టించారని, వైసిపి నేతలు తమ అక్రమార్జనలకు ఇసుకను ఆదాయ వనరుగా చేశారని పేర్కొన్నారు.  ఎరువులు, పురుగు మందుల బ్లాక్ మార్కెటింగ్ గురించి గతంలో విన్నాం కానీ ఇసుక బ్లాక్ మార్కెటింగ్ గురించి ఇప్పుడే చూస్తున్నామని ఎద్దేవా చేశారు.

ఐదురెట్ల అధిక ధరలకు ఇసుక విక్రయాలు చేస్తున్నారని,  తీయాల్సిన దానికన్నా 5రెట్లు తక్కువ తీస్తున్నారని తెలిపారు. కృత్రిమ కొరతను ,బ్లాక్ లో విక్రయాలను  త్సహించారని...  విజయవాడ దీక్ష ప్రకటన చేశాక ఇసుక అందుబాటు స్వల్పంగా పెంచారన్నారు.  14నుంచి ఇసుక వారోత్సవాల ప్రకటన అందులో భాగమేనని... వైసిపి నేతలే  చెన్నై, బెంగళూరు,   హైదరాబాద్ కు ఇసుక అక్రమ రవాణా  చేస్తున్నారని ఆరోపించారు.

లారీ ఇసుక రూ.80వేల నుంచి రూ.లక్షకు అమ్మడం చరిత్రలో ఉందా...? వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి రాజీలేని పోరాటం చేస్తున్నామని... భవన నిర్మాణ కార్మికులకు అండగా టిడిపి ఉంటుందన్నారు. 

వైసిపి ప్రభుత్వ వైఫల్యాలపై టిడిపి పోరాట కమిటి ఏర్పాటు, ఇసుక కొరతపై బొండా ఉమామహేశ్వర రావు నేతృత్వంలో టిడిపి పోరాట కమిటి ఏర్పాటు చేశారని తెలిపారు. సభ్యులుగా అచ్చెన్నాయడు, రామానాయుడు,వర్ల రామయ్య,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అఖిలప్రియ,ఆలపాటి రాజేంద్ర ప్రసాద్,బండారు సత్యనారాయణ మూర్తి  వున్నారని వెల్లడించారు. ఈ నెల 14న ఇసుక దీక్షతో అయినా వైసిపి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, మొద్దునిద్ర నుంచి వైసిపి నేతలు మేల్కొనాలని చంద్రబాబు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios