విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలోనే నివాసం వుంటున్నా ఇవాళ కొత్తగా పర్యటన చేపట్టడం విడ్డూరంగా వుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కేవలం ఏదో విధంగా  మీడియాలో కనపడాలనే చీఫ్ పబ్లిసిటీ కోసమే ఆయన ఇలా రాజధాని పర్యటన అంటూ నాటకాలు ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. 

విజయవాడ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నాని విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మూడు రోజులు కడప జిల్లా వెళ్ళిన చంద్రబాబు పిచ్చి కుక్కలా మొరిగి వచ్చాడన్నారు. ఇక ఇవాళ, రేపు పనేమీ లేదు కాబట్టి అమరావతి పర్యటన అంటూ ఓ పనికిమాలిన పర్యటన చేపట్టాడని నాని విమర్శించారు. 

ఈ రెండురోజుల తర్వాత శనివారం, ఆదివారం హైదరాబాదు వెళ్ళి హెరిటేజ్ వ్యాపారాలు చూసుకుంటాడని...ఇలా దోచుకున్న డబ్బులు సింగపూర్ కు పంపించి  ఎలా దాచుకోవాలో చూసుకుంటాడని నాని ఆరోపించారు. కాబట్టి ఈ రోజంతా చంద్రబాబు అమరావతి లో తిరిగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై, రాష్ట్ర ప్రభుత్వంపై పిచ్చి కుక్కలాగా మొరుగడమే పనిగా పెట్టుకుంటాడు.

read more  ప్యాకేజీ కోసమే వీధిప్రదర్శనలు... పవన్ ను చూస్తే జాలేస్తోంది: విజయసాయి రెడ్డి

చంద్రబాబు గతంలో అమరావతి తానే కట్టానని అన్నాడని గుర్తుచేశారు. కానీ ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి కట్టడంలేదని అంటున్నాడని... ఇంతకూ అమరావతిని కట్టినట్లా...కట్టనట్లా ఆయనే ఓ క్లారిటీకి  రావాలని ఎద్దేవా చేశారు. 

రాజధాని అమరావతి, పోలవరం  ప్రాజెక్టు నిర్మాణంతో పాటు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం   పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.  చంద్రబాబు నాయుడు లాగా ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లు పోలవరం, అమరావతిలను కేవలం దోచుకోవడానికి ఏటిఎం లుగా వాడటం లేదని అన్నారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని స్మశానం అన్నాడని తెగ విమర్శలు చేస్తున్నారని గుర్తుచేశారు. నిజానికి సగం కట్డిన కట్టడాలతో అది స్మశానం లాగా ఉంది వాటిని నువ్వు ఏం చూస్తావని మాత్రమే బొత్స అన్నారని వివరణ ఇచ్చారు. 

Chalo Amaravathi : రాజధానిలో చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేసిన రైతులు

చంద్రబాబు వైసిపి ఎమ్మెల్యేలు అందరినీ శవాలు అంటున్నాడని...కానీ నిజమైన శవం ఆయనేనని గుర్తించాలన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లాంటి శవాన్ని అధ్యక్షుడుగా పెట్టుకుందని...అలాంటి శవం అమరావతిలో ఉండకూడదన్నారు. ఈ  శవాన్ని కృష్ణా నది ఒడ్డున పడుకోబెట్డాలని మంత్రి కొడాలి నాని సూచించారు.