ప్యాకేజీ కోసమే వీధిప్రదర్శనలు... పవన్ ను చూస్తే జాలేస్తోంది: విజయసాయి రెడ్డి
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయన కేవలం ప్యాకేజీల కోసమే విధినాటకాలు ఆడుతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు.
అమరావతి: జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా రెండు నియోజక వర్గాల్లో పొటీచేసి ఓడిపోయారని... జనసేనలో ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టేనని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
''సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ నిర్మాణం లేదు, రెండు చోట్లా చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే. ప్యాకేజి కోసం వీధి ప్రదర్శనలిస్తున్నాడు. సానుభూతి చూపడం మినహా ఏం చేస్తాం.'' అంటూ పవన్ పై విరుచుకుపడ్డారు.
read more పవన్ పై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఉదారత: ప్రత్యర్థులు సైతం పొగడ్తలు, ఏం చేశారంటే...
ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా విఫలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఇసుక కొరతకు చంద్రబాబు నాయుడు వైఖరే కారణమని.... ఆనాడు జనసేన పార్టీ అధినేత పవన్ ఎందుకు నోరు మెుదపలేదని నిలదీశారు. ఇప్పుడు మాత్రం తగుదునమ్మా అంటూ వచ్చి రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు .
ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఒక్కచోట కూడా గెలవలేకపోయాడని విమర్శించారు. పార్టీ అధినేతగా ఆయనకే దిక్కులేనప్పుడు ఏదో పోరాటం చేసేస్తాడంట అంటూ మండిపడ్డారు.
read more మంత్రి పీఏనంటూ బురిడీ... భారీ మోసాలకు పాల్పడిన నిందితుడి అరెస్ట్
పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. సీఎం జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణాలు ఏంటో తెలియని పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా కొనసాగే అర్హత లేదన్నారు.
పవర్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు అధికార దాహం ఎక్కువ అంటూ తిట్టిపోశారు. అందువల్లే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసిన కుటిల రాజకీయాలను ప్రజలు గమనించారని చెప్పుకొచ్చారు. అందువల్లే 2019 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని అయినప్పటికీ నేతల్లో మార్పు రావడం లేదని మండిపడ్డారు మంత్రి ధర్మాన కృష్ణదాస్.