Asianet News TeluguAsianet News Telugu

నీ రహస్యాలన్నీ నాకూ తెలుసు... బయటపెట్టమంటావా...?: పవన్ కు బొత్స హెచ్చరిక

టిడిపి నాయకులు చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లు ఎన్నికల సమయంలో రహస్య స్నేహాన్ని సాగించారని మంత్రి బొత్స ఆరోపించారు. కానీ ప్రస్తుతం ముసుగు తొలగించి బహిరంగ స్నేహాన్ని సాగిస్తున్నారని అన్నారు. 

minister botsa satya narayana shocking comments on pawan kalyan and chandrababu
Author
Amaravathi, First Published Nov 5, 2019, 3:16 PM IST

 అమరావతి: ఇండియా మ్యాపులో అమరావతి పేరు లేకుండా చేసిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు అ అంటే చాలు అమరావతి అన్నట్లుగా హడావుడి చేశారని...కానీ ఇప్పుడేమో ఇలా జరిగిందన్నారు. గత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లే  చంద్రబాబు రాజధానికి అడ్రస్ లేకుండా చేశారన్నారు. 

రాష్ట్ర రాజధాని విషయంలో ఇంతటి ఘోరమైన తప్పిదం చేసి అడ్రస్ లేకుండా చేసిన చంద్రబాబు వైసీపీపై సిగ్గు లేకుండా విమర్శించడం తగదన్నారు. ఇటీవల బీజేపీలో కొత్తగా చేరిన సుజనా చౌదరి వంటి చంద్రబాబు తోకలు ఇంకా రాజధాని విషయంలో వైసీపీనే విమర్శిస్తున్నారన్నారు. చంద్రబాబు, సుజనా లాంటి వాళ్ల వల్లే రాజధానికి అడ్రస్ లేకుండా పోయిందని బొత్స మండిపడ్డారు. 

బాలల దినోత్సవం నాడు ఇసుకపై ఆందోళన ఏంటని ప్రశ్నించారు. దెబ్బల మీద దెబ్బలు తగులుతుండటంతో చంద్రబాబు బుర్ర పాడైందనుకుంటా అని ఎద్దేవా చేశారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టే రోజు కావాలని ఆందోళనా కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసింది వైఎస్‌ఆర్ అని మాత్రమేనని అన్నారు.. వారికోసం చంద్రబాబు ఒక్క పనైనా చేశారా..? అని ప్రశ్నించారు.

read more  పార్టీని నడపడం ఆర్థిక భారమే... కానీ అదొక్కటి కావాల్సిందే..: పవన్ కల్యాణ్

ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబుకు ఆయన ఫ్రెండ్ పవన్ కల్యాణ్ తోడయ్యారన్నారు. ఎన్నికల ముందు ఇంటర్నల్ గా ఇప్పుడు ఎక్స్ టర్నల్ గా వారిద్దరి స్నేహం కొనసాగుతోంది. సినిమాల్లో చేసిన యాక్షనంతా రాజకీయాల్లో చేస్తున్నారని పవన్ పై మండిపడ్డారు. రాజకీయాల్లో యాక్షన్ పనికి రాదన్నారు.

పవన్ గురించినాకూ కొన్ని విషయాలు తెలుసని...వాటిని బయటపెడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదన్నారు. 2014లో తాను పెద్ద పుడింగి అయ్యింటే గెలిచేవాడినేగా..? జగన్ అవసరం రాష్ట్రానికి ఉందని.. రెండు మెట్లు దిగి వైసీపీలో చేరుతున్నానని ఆ రోజే చెప్పానని మంత్రి గుర్తుచేశారు. వాస్తవాలు అంగీకరించకుండా తానే పుడింగి అనుకోవడం సరికాదన్నారు. 

గత ప్రభుత్వంలో ఎన్నో అకృత్యాలు జరిగినా హీరోగారు ఎందుకు స్పందించ లేదో చెప్పాలన్నారు. సమయం-సందర్భం లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరని...దాన్ని పవన్ గుర్తించాలన్నారు. 

రాజధానిని బంగారు బాతులా చేశానంటూ చంద్రబాబు తెగ చెప్పుకుంటున్నారని...ఇప్పుడీ బంగారు బాతు ఎక్కడ ఉంది..? చెప్పాలని ప్రశ్నించారు. రాజధాని బంగారు బాతు కాదు.. అడ్రస్ లేని బాతులా తయారైందని ఎద్దేవా చేశారు. బీజేపీలో రెండు రకాల వాయిస్ లు వినిపిస్తున్నాయని అన్నారు.

చంద్రబాబు, లోకేశ్ విదేశీ ప్రయాణాలు అందుకోసమే...: లక్ష్మీపార్వతి

ప్రస్తుతం రాజధానికి ఉన్నది టెంపరరీ అడ్రస్సేనని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు రాత్రికి రాత్రి ఎందుకు వచ్చేశారు..? నాకూ ఏసీబీ ఉంది.. నాకూ పోలీసులు ఉన్నారు.. సెక్షన్-8 ఉందన్న చంద్రబాబు ఎందుకు వచ్చేశారని  నిలదీశారు. 

రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు పర్యటించి ఏం చూస్తారు..? కరకట్ట మీద చంద్రబాబు ఇల్లు చూస్తారా..? నన్ను రమ్మంటే నేనూ వస్తా.. అన్ని చెబుతా అని బొత్స అన్నారు.సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలనేది చంద్రబాబు థియరీగా వుందన్నారు. అవినీతి విషయంలో చంద్రబాబు ఈ థియరీని ఫాలో అవుతారన్నారు.

 25 ఏళ్లు రాజకీయాల్లో ఉండడానికి వచ్చానన్న పవన్.. ఇంకా 15 ఏళ్లు రాజకీయాల్లో ఉండాలంటే జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఇప్పటికే చంద్రబాబు పని అయిపోయిందని...
తాట తీస్తా.. ఊరికొస్తా అంటూ పవన్ కామెంట్లు చేయడం సరికాదన్నారు. ఊరికొస్తే ఏమవుతుంది..? ఏం కాదు.. ఓ పది మంది వస్తారు.. చూసి వెళ్లిపోతారంతే అని బొత్స సెటైర్లె వేశారు. 

సీఎస్ బదిలీని కూడా రాజకీయాలు చేయాలని చూస్తున్నారని...కానీ అది చాలా రోటీన్ అన్నారు. సీఎస్, సెక్రటరీల బదిలీలు కామనే అని అన్నారు. మంత్రులు వస్తూ ఉంటారు....మారుతూ ఉంటారు అలాగే సీఎస్ బదిలీ కూడా అని ఉదహరించారు. 

పవన్ కు భవన నిర్మాణ కార్మికుడి డెఫినెషన్ తెలుసా..? అని ప్రశ్నించారు. తట్టా.. బుట్టా పట్టుకున్న ప్రతి ఒక్కరూ భవన నిర్మాణ కార్మికుడు కాదన్నారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ తెచ్చిన జీవోను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios