ఈ ఒక్కసారే ఇక్కడ...వచ్చే ఏడాది వైజాగ్ లోనే..: మంత్రి అనిల్

ఆంధ్ర  ప్రదేశ్ రాజధాని మార్పుపై  నీటిపారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

minister anil kumar yadav interesting comments on ap capital

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ రూపొందించిన 2020 క్యాలెండర్ ను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు.  ఉన్నతోద్యోగులు,  ఉద్యోగసంఘాల నాయకులతో కలిసి 2020 క్యాలెండర్, డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని విషయంలో మంత్రి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 

ఈ  ఒక్కసారికి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోందన్నారు. వచ్చే ఏడాది ఇదే ఆవిష్కరణ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో జరుపుకుందాం అంటూ పరిపాలనా రాజధాని అమరావతి నుండి తరలడం ఖాయమన్న సంకేతాలిచ్చారు. ఉద్యోగులు ఇందుకు సిద్దంగా వుండాలని పరోక్షంగా మంత్రి సంకేతాలిచ్చినట్లుగా కనిపిస్తోంది. 

 read more మంత్రులను చెప్పులతో కొట్టడం ఖాయం...: బోండా ఉమ

ఇక  ఇరిగేషన్ శాఖలో ఉద్యోగాల భర్తీ  చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. జలాశయాల వద్ద సిబ్బంది కొరత వేధిస్తోంది... అందుకే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన లష్కర్లను భారీగా నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 11 వేలు ఉండవలిసిన లష్కర్ లు తక్కువ ఉన్నారని... అందుకే 3 వేల లష్కర్ పోస్టుల ను రీక్రూట్  చేయనున్నట్లు ప్రకటించారు. ఇలా సాగునీటి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

జగన్మోహన్ రెడ్డి సీఎం  పదవిని అధిరోహించిన తర్వాత రాష్ట్రం జల కళతో కళకళలాడుతోందన్నారు.. ఇరిగేషన్ శాఖలోని అన్ని విభాగాలు ఒకే  భవనంలో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఎన్ని ఇబ్బందులు వున్నా సంక్షేమనికి సీఎం పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. 

తమ ఫైల్స్ అయితే ఎలా ఫాస్ట్ గా వుండాలని ఉద్యోగులు అనుకుంటారో తమ దగ్గరికి వచ్చే వారివి సైతం అలానే పాస్ట్ గా  మూవ్ అయ్యేలా చూడాలని సూచించారు. ఇలాగయితే ఉద్యోగులకు మంచిపేరు రావడంతో పాటు పనులు కూడా తొందరగా  పూర్తవుతాయన్నారు.

read more   యువతకు ఉద్యోగాలిచ్చిమరీ జగన్ చెడగొడుతున్నారు...ఇదే ఉదాహరణ...: పంచుమర్తి అనురాధ

ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ టైమ్ ఉద్యోగులయితే తాము కేవలం పార్ట్ టైం ఉద్యోగులమేనని అన్నారు. ఇరిగేషన్ ఉద్యోగస్తుల సమస్యలు అన్ని పరిష్కరిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios