ఆ నిర్ణయంతో లోకేశ్, యనమల మైండ్ బ్లాంక్... చంద్రబాబు అయితే...: మంత్రి కన్నబాబు
కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం స్నేహంగా వుండడాన్ని టిడిపి నాయకులు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.
అమరావతి: ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మంచి సంబంధాన్ని కలిగివుండటం చూసి చంద్రబాబుకు కడుపుమంటగా వున్నట్లుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. అందువల్లే ఆయన దిగజారుడు మాటలు ఆడుతున్నారని... ప్రజలు ఛీ కొట్టినా ఆయనలో ఇంకా మార్పు రాలేదన్నారు.
అధికారం లేకపోతే ఒక్క గంట కూడా గడపలేని పరిస్థితికి చంద్రబాబు చేరుకున్నారని అన్నారు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ లు డిల్లీలో మాట్లాడుకుంటే ఆ మాటలు చంద్రబాబుకెలా తెలిసాయో అర్ధంకావడం లేదన్నారు. బహుశా అక్కడే ఆయన కార్పెట్లు క్లీన్ చేయడంగానీ... కాఫీ కప్పులు తీయడంగానీ చేస్తున్నారేమోనని మంత్రి ఎద్దేవా చేశారు.
ప్రధానితో ముఖ్యమంత్రి జగన్ భేటీపై కావాలనే టిడిపి దుష్ర్పచారం చేస్తోందన్నారు. చంద్రబాబు 32 సార్లు ఢిల్లీ వెళ్లినా ఏమీ సాధించలేకపోయారని... కానీ పచ్చమీడియాలో మాత్రం ఆయన ఢిల్లీ వెళ్లినా ప్రతిసారీ చంద్రగర్జన అంటూ ప్రచురించేవారన్నారు. అప్పుడు ప్రధాని మోదీ గురించి విమర్శలు చేస్తూ సిగ్గులేకుండా ఏదిపడితే అది మాట్లాడి ఈరోజు తగదునమ్మా అంటూ జగన్ పర్యటనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
read more ఆ తీర్పు మాజీ మంత్రి పుల్లారావుకు చెంపపెట్టు...: ఎమ్మెల్యే విడదల రజిని
వ్యక్తిగత అవసరాలకోసం కాళ్లు పట్టుకునే పరిస్దితి చంద్రబాబుది కానీ జగన్ ది కాదన్నారు. కొన్ని పత్రికలు జగన్ పర్యటనపై ఏం రాస్తున్నారో తెలియకుండా రాసేస్తున్నారని... అలాంటి వాటికి తగిన విధంగా బుద్దిచెబుతామని హెచ్చరించారు.
శాసనమండలి రద్దు చేస్తున్నామంటే మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ ల మైండ్ బ్లాక్ అయిందన్నారు. యనమల ప్రపంచంలో తానొక్కడే మేధావి అని అనుకుంటున్నారని... అయితే ఎన్ని అబద్దాలు చెప్పినా నమ్మటానికి ప్రజలు సిధ్దంగా లేరని ఆయన గుర్తించాలన్నారు.
ఢిల్లీనుంచి దావోస్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చారని విమర్శించారు. రాజధానిని తరలిస్తున్నట్లు చంద్రబాబు కృత్రిమ ఉద్యమం సృష్టించారని మండిపడ్డారు. రాష్ర్టంలో ఏదో జరిగిపోతుందన్నట్లు భ్రమలు సృష్టించారని... అదీ చాలదన్నట్లు జోలి పట్టుకుని బాబ్బాబు అంటూ అడుక్కుంటున్నట్లు డ్రామాలు ఆడారని విమర్శించారు. జోలెలో పడ్డ బంగారం,వెండి,డబ్బు ఏమయ్యాయో చంద్రబాబు చెప్పాలని మంత్రి నిలదీశారు.
read more పులివెందులపై మరిన్ని వరాలు... సీఎం జగన్ నుండి అధికారులకు ఆదేశాలు
ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి చంద్రబాబుకు తెలియదా..? అని ప్రశ్నించారు. అక్కడి ప్రజల మనోభావాలు చంద్రబాబుకు పట్టవా... అని అడిగారు. ఆయనకు పార్టీని బతికించుకోవాలనే తపన తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కనిపించడం లేదన్నారు.
ఆర్దిక సంక్షోభంలోకి ఎవరు ఎవర్ని నెట్టారో చర్చకు సిధ్దమా అని సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని అప్పులఊబిలోకి నెట్టింది ఆయనేనని...ఆర్దిక పరిస్దితిని ఛిన్నాభిన్నం చేసింది యనమల అని ఆరోపించారు. దొరికిన చోటల్లా అఫ్పులు తెచ్చి పప్పుబెల్లాల్లా పంచిపెట్టారన్నారు. పోలవరంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడి ప్రత్యేకహోదాను నీరుగార్చింది చంద్రబాబేనని కన్నబాబు ఆరోపించారు.