జగన్ కు కేంద్ర ప్రభుత్వ అండదండలున్నాయా...?: కన్నా ఏమన్నారంటే

జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కంటే తక్కువేం కాదని ఏపి బిజెపి అధ్యక్షులు  కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. జగన్ చేస్తున్న తుగ్లక్ పాలనకు కేంద్రం అండదండలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంపై కన్నా స్పందించారు. 

kanna lakshminarayana reacts on AP Decentralisation and Development Bill

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ జరిగిన పరిణామాలు దురదృష్టకరమని బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్ర రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.    రాజధాని మార్పుపై వైసిపి ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటామని కన్నా తెలిపారు. 

ఇప్పటికే బిజెపికి చెందిన పార్టీ ముఖ్య నాయకులంతా కూర్చొని రాజధాని మార్పుపై ఒక స్టాండ్ ని తీసుకున్నామని... దానికే కట్టుబడి ఉన్నామన్నారు. రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకునే హక్కు ముఖ్యమంత్రి జగన్ కి లేదన్నారు. స్టేట్ హోల్డర్స్,  మిగతా రాజకీ యపార్టీల అభిప్రాయం తీసుకోకుండా ఒక నియంతలా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. 

జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం కంటే తక్కువేం కాదని విమర్శించారు. జగన్ చేస్తున్న తుగ్లక్ పాలనకు కేంద్రం అండదండలు ఉన్నాయని చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. 

Video:రాజధాని కోసం సహాయ నిరాకరణ... పోలీసులకు మహిళల స్ట్రాంగ్ వార్నింగ్

చంద్రబాబు తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. అయితే ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. ఇప్పుడు జగన్ సైతం కేంద్రం అండదండలతోనే చేస్తున్నా అంటూ ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి ఇప్పటివరకు జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం ఎంతో నష్టపోతోందన్నారు. జగన్ తుగ్లక్ నిర్ణయాలతో ఒక తరం తీవ్రంగా నష్టపోబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

read more  కేశినేని నాని హౌస్ అరెస్ట్... పోలీసులపై ఎంపీ ఫైర్

అమరావతి అభివృద్ధికి లక్షకోట్లు కావాలని చెప్పిన జగన్ ఇప్పుడు వైజాగ్ తీసుకెళ్తు అంతే విలువైన ప్యాకేజీ ప్రకటించడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజధాని మార్పు కేవలం ఇతర ప్రాంతాల్లో దోచుకోవడానికి, భూకుంభకోణలకోసమేనని ఆరోపించారు. అంతకుమించి మరే కారణమైన వుంటే దాన్ని బయటపెట్టి ప్రజలను ఒప్పించి రాజధానిని మార్చాలన్నారు. 

ప్రాంతీయ పార్టీలు ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చుకు మించి సంపాదించుకునేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటాయని... వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోందన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కన్నా వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios